ప్లాస్మాదానం పేరుతో ఫేక్ నంబర్లు..!

- ఫోన్ కలువదు.. కలిస్తే లిఫ్ట్ చేయరు
- ప్లాస్మా, రక్తం ఇస్తామంటూ వందల ఫోన్ నంబర్ల లిస్టు
- సరైనవో.. కావో.. తేల్చుకోకుండానే గుడ్డిగా షేర్ చేస్తున్న నెటిజన్లు
- ఆశతో అన్ని నంబర్లకు ఫోన్ చేస్తున్న బాధితులు
- ఒక్కటికూడా పనిచేయక కీలక సమయం వృథా
ఆపద సమయంలో ఆదుకునే వారి కోసం బాధితులు పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. చివరి నిమిషంలో ప్రాణాలు కాపాడుకోవాలనే ఆలోచనతో సేవా మూర్తుల కోసం ఎదరుచూస్తుంటారు. ఓ వైపు వైద్యులు డెడ్‌లైన్ విధించి బ్లడ్, ప్లాస్మా, ఇంజక్షన్ కావాలని చెబుతారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్లాస్మా, రెమిడెసివర్‌కు డిమాండ్ చాలా ఉంది. ఈ కొవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో చాలా మంది వాటి కోసం సోషల్ మీడియానే ఆశ్రయిస్తున్నారు. చాలా మంది రక్తం, ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధమంటూ ఫోన్ నంబర్లతో కూడిన సమాచారాన్ని విరివిగా షేర్ చేస్తున్నారు. వందల నంబర్లు ఆ లిస్టులో ఉంటున్నాయి. బాధితులు ఆ సమాచారాన్ని చూసి ఊపిరిపీల్చుకుని నంబర్లకు ప్రయత్నిస్తే ఆ నంబర్లు పని చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
వందల నంబర్లలో ఒక్క నంబర్ పని చేయదా అనే ఆశతో అన్ని నంబర్లకు కాల్ చేస్తున్నారు. కానీ అందులో ఏ ఒక్క నంబర్ కలవడం లేదు. రింగ్ అయినా.. లిఫ్ట్ చేయడం లేదు. పదే పదే ఫోన్ చేసి బాధితులు ఆశలు వదులుకుంటున్నారు. అనవసరంగా వారి విలువైన సమయం వృథా చేసుకుంటున్నారు. నెటిజన్లు ఫేక్ నంబర్లను గుడ్డిగా వైరల్ చేయకుండా సరైనవా? కావా? అని పరిశీలించాకే షేర్ చేయాలని ఐటీ నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉండాలని.., నిజంగా సేవ చేసే వారి వివరాలను మాత్రమే షేర్ చేయాలని తెలుపుతున్నారు. ఒకవేళ ఆ సమయంలో ఇవ్వడం కుదరని వాళ్లు ఫోన్ లిఫ్ట్ చేసి విషయం తెలియజేయాలని లేదా మెస్సేజ్ చేయాలని సూచించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- fake numbers
RELATED ARTICLES
తాజా వార్తలు
ధాన్యం కొనుగోళ్లపై ప్రణాళిక లేని ప్రభుత్వం : గొంగడి సునీత
Shatrucharla Passed away | టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
Man pushed Woman Under train | రైలులో మహిళను వేధించిన వ్యక్తి.. అతడు తోయడంతో రైలు కిందపడి చేయి కోల్పోయిన యువతి
‘ప్రతి ఒక్కరు కేవైసీ చేయించుకోవాలి’
IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా మహేష్ భగావత్
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

