రూ.300 పెడితే.. 450 ఇస్తాం..!

- వెలుగులోకి మరో చైనా యాప్
- పవర్ బ్యాంక్ యాప్ పేరుతో మోసం
- దేశవ్యాప్తంగా 5లక్షల బాధితులు.. రూ. 350 కోట్లు స్వాహా
- చైనా సైబర్ నేరగాళ్ల కోసం బ్లూ కార్నర్ నోటీసులు జారీ
- పట్టుబడినవారిని హైదరాబాద్ తీసుకువచ్చేందుకు సన్నాహాలు
సిటీబ్యూరో, జూన్ 18(నమస్తే తెలంగాణ): చైనా దేశానికి చెందిన పవర్ బ్యాంక్ మోసాలు వెలుగులోకి వచ్చా యి. ఇటీవల రూ. 300 పెట్టుబడి పెడితే గంటకు అదనంగా రూ.450 ఇస్తామంటూ నమ్మించి చిన్న మొత్తాల లో పెట్టుబడులు పెట్టించి, ఆన్లైన్ మల్టీలెవల్ మార్కెటిం గ్ మాదిరిగా మోసాలు చేశారంటూ కొందరు బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేవలం హైదరాబాద్‌లోనే ఇలాంటి బాధితులు 150 నుంచి 200 మందికి పైగా ఉండగా.. రూ. 20లక్షల వరకు పెట్టుడులు పెట్టి మోసపోయారు. అందులో కొంద రు మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రెండు కేసులు నమోదయ్యాయి. ఇలాంటి కేసులు ముంబాయి, బెంగళూరు, డెహ్రాడూన్, ఢిల్లీ, నోయాడా ప్రాంతాలలో నూ నమోదయ్యాయి.
ఈ కేసులో ఉత్తరాఖండ్ పోలీసులు ఈ నెల 9న సూత్రదారి అయిన నోయిడాకు చెందిన పవన్‌కుమా ర్ పాండ్యతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. అదే తరహాలో ఢిల్లీ పోలీసులు 11 మందిని పట్టుకున్నారు. ఈ ముఠాల ను విచారించడంతో సూత్రదారులంతా చైనాలో ఉన్నారని, బీజింగ్, హాంకాంగ్‌ల నుంచి ఇదంతా నడుపుతున్నారని వెల్లడించారు. పవర్ బ్యాంక్ యాప్ పేరుతో గూగుల్ ప్లే స్టోర్స్‌లో అందుబాటు లో పెట్టి దేశ వ్యాప్తంగా లక్షలాది మందిని మోసం చేసి రూ.350 కోట్లకుపైగానే స్వాహా చేసినట్లు ప్రాథమికంగా పోలీసులు తేల్చారు. దీంతో చైనా సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కోసం ఆయా రాష్ర్టాల సైబర్‌క్రైమ్ పోలీసులు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశారు. ఢిల్లీ, జార్ఖండ్ పోలీసుల కు పట్టుబడిన వారిని పీటీ వారెంట్‌పై తీసుకొచ్చేందుకు నగర సైబర్‌క్రైమ్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- fake apps
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

