ఈ శివయ్య మామూలోడు కాదు..
రియల్ ఎస్టేట్‌లో డబ్బు ఎలా సంపాదించాలి.. ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలనే విషయాలపై యూట్యూబ్ ఛానల్లో అదరగొట్టే స్పీచ్‌లు ఇచ్చారు.. అతడు చెప్పేదంతా నిజమని పలువురు నమ్మారు.
- డబ్బు ఎలా సంపాదించాలంటూ ప్రసంగాలు..
- నమ్మి వచ్చిన వారిని నట్టేట ముంచిన శివయ్య అండ్ గ్యాంగ్
- జైలుకు వెళ్లి వచ్చినా బుద్ధిమారని వైనం
- యూట్యూబ్‌లో ఇలాంటి వ్యక్తులు ఇచ్చేప్రసంగాలతో మోసపోవద్దు
- సీసీఎస్ డీసీపీ శ్వేత
సిటీబ్యూరో, జూన్ 11(నమస్తే తెలంగాణ): రియల్ ఎస్టేట్‌లో డబ్బు ఎలా సంపాదించాలి.. ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి చేయాలనే విషయాలపై యూట్యూబ్ ఛానల్లో అదరగొట్టే స్పీచ్‌లు ఇచ్చారు.. అతడు చెప్పేదంతా నిజమని పలువురు నమ్మారు. అతడు చెప్పిన చోట పెట్టుబడులు పెట్టి కోట్ల రూపాయలు మోసపోయారు. అతడితో పాటు అతడికి సహకరిస్తున్న న్యాయవాది, అతడి భార్య, కొడుకుపై ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. సీసీఎస్‌లో ఈ ముఠాపై రెండు కేసులు నమోదు కావడంతో నలుగురిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా తిరిగి అదే విధంగా అమాయకులకు శఠగోపం పెట్టే పనులు చేస్తుండటంతో అప్రమత్తంగా ఉండాలని సీసీఎస్ డీసీపీ శ్వేత ప్రజలకు సూచించారు. వివరాలిలా ఉన్నాయి. మొల్ల శివయ్య అలియాస్ శివకుమార్ రియల్ ఎస్టేట్, హెల్త్‌కు సంబంధించిన అంశాలపై మిమాంస, రీబూట్ పేర్లతో యూట్యూబ్ ఛానల్స్ నడిపించాడు. ఈ ఛానల్స్‌తో పాటు ఇండోర్, ఔట్‌డోర్‌లో శిక్షణ, అవగాహన తరగతులు నిర్వహించాడు. ఇందుకు భార్య స్వర్ణలత, కొడుకు జస్వంత్ అతడికి సహకరిస్తూ.. బాధితుల నుంచి ఫీజులు వసూలు చేయడం, శివయ్య చేసే మోసాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ఈ క్రమంలోనే అతడు నమ్మిన వారితో పెట్టుబడులు పెట్టించి మోసం చేశాడు. బ్యాంకుల టెండర్లలో పాల్గొని, పెట్టుబడులు పెట్టి.. తీసుకున్న వస్తువులను ఎక్కువ ధరకు విక్రయించి మంచి లాభాలు పొందవచ్చని నమ్మించాడు. ఈ మాటలు నమ్మిన దాదాపు 30 మంది రూ.10.86 కోట్లు పెట్టుబడిగా అతడి వద్ద పెట్టారు. మిమాంస, రియాల్టీ ఔర ప్రైవేట్ లిమిటెడ్, జ్యోషికా ఇన్వెస్టర్ క్లబ్ పేర్లతో ఉన్న శివయ్య కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. శివయ్యకు జి.శ్రీనివాస్ అనే న్యాయవాది సహకరించాడు. ఈ ముఠాపై వచ్చిన ఫిర్యాదులతో ఎల్బీనగర్, బాచుపల్లి, కేపీహెచ్‌బీ, సీసీఎస్‌లో కేసులు నమోదయ్యాయి. సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించడంతో శివయ్య 88 రోజులు చంచల్‌గూడ జైల్లో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా తిరిగి అదే యూట్యూబ్ ఛానల్స్‌తో అమాయకులను మోసం చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో అతడితో పాటు అతడి కుటుంబ సభ్యులతో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు సూచిస్తూ డీసీపీ ఒక ప్రకటన విడుదల చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

