సెలవులు కావొద్దు భారం
ఎండాకాలం అంటేనే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. స్కూల్, హోం వర్క్ లాంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. పిల్లలకు వినోదాన్ని పంచే వేసవి రానే వచ్చింది.
- మే మాసంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు
- వడదెబ్బతో ప్రాణాలకు ముప్పు
- పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు
- సెలవులు వినోదంతో
- పాటు విజ్ఞానాన్ని పంచేలా ఉండాలని సూచన
సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ఎండాకాలం అంటేనే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. స్కూల్, హోం వర్క్ లాంటివి లేకుండా స్వేచ్ఛగా ఆడుకోవచ్చని మురిసిపోతుంటారు. పిల్లలకు వినోదాన్ని పంచే వేసవి రానే వచ్చింది. ప్రస్తుతం అన్ని రకాల పరీక్షలు ముగిశాయి. దీంతో పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతున్నది. రానున్న మే మాసంలో ఉష్ణోగ్రతలు 41డిగ్రీలకు చేరుకోనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పిల్లలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు భానుడి ప్రతాపానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదంటున్నారు. చిన్నపిల్లలు డీహైడ్రేషన్, సన్‌స్ట్రోక్(వడదెబ్బ), హెపటైటిస్ తదితర సమస్యల బారిన పడే అవకాశాలున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఉదయం నుంచే ఎండల తీవ్రత పెరిగి అతినీలలోహిత కిరణాలు వెలువుడుతుండడంతో పిల్లలు డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉన్నట్లు నిలోఫర్ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
పిల్లల్లో పొంచివున్న డీహైడ్రేషన్ ప్రమాదం
డీ హైడ్రేషన్(నిర్జలీకరణ)అంటే శరీరంలోని నీరు ఆవిరైపోవడం. ముఖ్యంగా ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారికి వ్యాధి నిరోదక శక్తి తక్కువగా ఉండడం వల్ల పిల్లలు త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతారని నిలోఫర్ సూపరింటెండెంట్ డా.ఉషారాణి తెలిపారు. ఎక్కువగా ఎండలో తిరగం, వడగాల్పులకు గురవడంతో ఈ సమస్య ఏర్పడుతుందన్నారు. అంతే కాకుండా వేసవిలో సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుందన్నారు. పిల్లలు ఎండలో తిరగడం వల్ల శరీరంలోని లవణాలు, నీరు వాతావరణంలోని ఉష్ణోగత్రకు ఆవిరైపోతుందని, దీంతో పిల్లలు నీరసించి పోతారన్నారు. పిల్లల్లో ‘హీట్ రెగ్యులేషన్ సిస్టమ్’ తక్కువస్థాయిలో పనిచేయడం వల్ల వారు త్వరగా వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయని, అందువల్ల పిల్లలను సాధ్యమైనంత వరకు ఎండల్లో బయటకు తీసుకెళ్లక పోవడమే శ్రేయస్కరమని సూచిస్తున్నారు.
ప్రాథమిక చికిత్స విధానం..
డీహైడ్రేషన్‌కు గురైన పిల్లలను వెంటనే దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు తీసుకెళ్లాలి. పిల్లలకు ఓఆర్ఎస్ ద్రవాన్ని కొద్ది కొద్దిగా తాగించాలి. ఓఆర్ఎస్ అందుబాటులో లేకపోతే ఇంట్లో కాచి, చల్లార్చిన నీటిలో చిటికెడు ఉప్పు, చిటికెడు చెక్కరను కలిపి ఆ ద్రవాన్ని తాగించాలి. అందుబాటులో ఉంటే కొబ్బరి నీళ్లు తాగించడం ఉత్తమం. వాంతులు, విరేచనాలు నియంత్రణ కాకపోతే వెంటనే దవాఖానకు తీసుకెళ్లాలి.
డీహైడ్రేషన్ ప్రమాదకరం
పిల్లలు డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలున్నాయి. డీహైడ్రేషన్‌కు గురై వాంతులు, విరేచనాలుతో బాధపడితే వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. ఎక్కువ శాతం ద్రవ పదార్థాలు ఇవ్వాలి. బయటి ఆహారానికి దూరంగా ఉంచాలి. పిల్లలను బయటకు పంపాల్సి వస్తే ఎండ తగల కుండా తలకు టోపి, లోదా గొడుగు వంటివి వినియోగించాలి. ఎండలో బయటకు వెళ్లే పిల్లలకు వదులుగా ఉండే కాటన్ దుస్తువులు వేయాలి.
– డాక్టర్ ఉషారాణి, సూపరింటెండెంట్, నిలోఫర్ హాస్పిటల్
డీహైడ్రేషన్ లక్షణాలు..
- వాంతులు, విరేచనాలు
- నీరసించి పోవడం
- కళ్లు లోపలికి వెళ్లినట్లు కనిపించడం
- నోరు ఎండిపోవడం
- శరీర ఉష్ణోగ్రత పెరిగి జ్వరం రావడం
- మూత్రం రాకపోవడం
- మూత్రంలో మంట, పసుపు, ఎరుపు రంగులో మూత్రవిసర్జన
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లోకనాయకుడి ‘దశావతారం’ రీరిలీజ్
బియ్యం వ్యాపారులపై క్రిమినల్ కేసులు
సెల్‌ఫోన్ లాక్కొని వేధింపులు.. విద్యార్థి ఆత్మహత్య
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

