వైకల్యాన్ని గెలిచిన మనోధైర్యం

- కదల్లేని స్థితిలోనూ విభిన్న రంగాల్లో రాణింపు
- ఊపిరి చిత్రమే ప్రేరణ
- అటు ఫ్యాషన్.. ఇటు చదువులోనూ
- రాణిస్తున్న దివ్యాంగురాలు
- ఖాళీ సమయంలో ట్యూషన్స్ చెబుతూ ఉపాధి
- కరోనా క్లిష్ట సమయంలో సాటి దివ్యాంగులకు సేవా కార్యక్రమాలు
- యూట్యూబ్ చానల్ ఏర్పాటు.. మొక్కల పెంపకంపై వీడియోల అప్లోడ్
- సందేశాత్మక షార్ట్‌ఫిల్మ్‌తో ప్రశంసలు .. ఆదర్శంగా నిలుస్తున్న దేవికారాణి
దివ్యాంగురాలైతేనేం.. మనోధైర్యంతో ముందుకుసాగుతున్నది. వీల్‌చైర్‌కు పరిమితమైన జీవితాలకు కొత్త వెలుగులు చూపిస్తున్నది. విభిన్న రంగాల్లో ప్రతిభ ప్రదర్శిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నది. పుట్టుకతోనే కాళ్లు పనిచేయకున్నా.. కుంగిపోకుండా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నది దేవికారాణి. డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుతున్న ఈమె.. చిన్నారులకు ట్యూషన్స్ చెబుతూ.. మరోవైపు ఫ్యాషన్ ప్రపంచంలోనూ తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటూ.. స్ఫూర్తినిచ్చింది. ఇటీవల నిర్వహించిన తెలంగాణ మిస్ ఎబిలిటీ పోటీల్లోనూ విజేతగా నిలిచింది. కరోనా క్లిష్ట సమయంలో సామాజిక సేవా కార్యక్రమాలతో తన సాటి దివ్యాంగులకు భరోసానిస్తున్నది.
ప్రావీణ్యంతో రాణింపు..
నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటున్న దేవిక ఇంట్లోనే ట్యూషన్ మాస్టర్ల సాయంతో 6వ తరగతి వరకు చదివింది. అనంతరం పాఠశాలకు వెళ్లి పదో తరగతి పూర్తి చేసింది. ప్రస్తుతం బీకామ్ కంప్యూటర్స్‌లో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆమె.. ఖాళీ సమయంలో చిన్నారులకు ట్యూషన్లు చెబుతూ ఉపాధి పొందుతున్నది. అటు డిజైనింగ్‌లోనూ ప్రావీణ్యం సంపాదించింది. సోషల్ మీడియాలోనూ ఓ యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించి ప్లాంటేషన్ చేయడంపై వీడియోలు అప్లోడ్ చేస్తున్నది. ఫ్యాషన్ పోటీల్లో పాల్గొని తెలంగాణ మిస్ ఎబిలిటీ టైటిల్ గెలచుకుని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా బహుమతి తీసుకున్నది. దివ్యాంగులతో స్నేహం ఎలా ఉంటుంది అనే ఇతివృత్తంతో స్నేహ చదరంగం అనే షార్ట్ ఫిల్మ్ తీసి ప్రశంసలందుకున్నది.
ఆత్మవిశ్వాసం నింపిన ఊపిరి
‘ఊపిరి’ సినిమాలో నాగార్జున చేసిన క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. నాలో ఆత్మ విశ్వాసాన్ని పెంచింది. అప్పటి నుంచి మరింత హార్డ్‌వర్క్ చేయడం ప్రారంభించాను. ఇంట్లో నుంచి బయటకు రావడమే కష్టంగా అనిపించే నాకు.. ఈ రోజు నాలాంటి వారికి సహాయం చేసే ప్రతి కార్యక్రమంలో వలంటీర్‌గా సేవలందిస్తున్నా. ప్రతి ఒక్కరూ చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మాలాంటి వాళ్లమే సమస్యలను దాటగలగ లేనిది.. వారికి అవకాశం ఉండదా? బతికి సాధించాలి. – దేవికారాణి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

