ఉస్మానియా యూనివర్సిటీ : నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి జన్మదిన వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజుతో పాటు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తార్నాక హనుమాన్‌నగర్‌లోని శ్రీ శివాంజనేయ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం దేవాలయ కమిటీ సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కీసర రామలింగేశ్వర స్వామి ఆలయంలో..
నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి జన్మదినంతో పాటు శివరాత్రి సందర్భంగా కీసరగుట్టలోని రామలింగేశ్వరస్వామిని ఆమె దర్శించుకున్నారు. ఆమెతో పాటు టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారిని ఆలయ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.