సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): రక్షణ శాఖ(Defense), విమానయాన రంగంలో(Aerospace) దేశీయంగా సరికొత్త ఆవ్కిరణలను ప్రోత్సహించేందుకు టీ హబ్‌లో డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇన్నోవేషన్ సమ్మిట్‌ను(Aerospace Innovation Summit) నిర్వహిస్తున్నారు. మే 1న నిర్వహించే సమ్మిట్‌లో రక్షణ శాఖకు, ఏరోస్పేస్ రంగాల్లో కొత్తగా స్టార్టప్‌లను ప్రారంభించి ఆవిష్కరణలు చేస్తున్న వారు పాల్గొనవచ్చని టీ హబ్ ప్రతినిధి తెలిపారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమ్మిట్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రతినిధులు, వెంచర్ క్యాపిటలిస్టులు, విద్యా సంస్థల నిపుణులు, రక్షణ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన నిపుణులతో డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సమ్మిట్ ఉంటుందని, మరిన్ని వివరాలకు ఈ కింది లింకు ( https://bit.ly/4cTzjGU )లో సంప్రదించాలని తెలిపారు.