రూ. లక్షలోపు సైబర్ ఫిర్యాదులు స్థానిక ఠాణాల్లోనే

- సీసీఎస్ సైబర్‌క్రైమ్ పీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి
- అన్ని పోలీస్స్టేషన్లలో అందుబాటులో సైబర్ నిపుణులు
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలకు సంబంధించి లక్ష రూపాయల నష్టం వాటిల్లే ఫిర్యాదులను ఇక గురువారం నుంచి స్థానిక పోలీస్ స్టేషన్లలోనే స్వీకరిస్తున్నారు. ఇందుకు నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తగు చర్యలు తీసుకున్నారు. సీసీఎస్ ఆధీనంలో ఉన్న సైబర్ఠాణాపై ఒత్తిడిని తగ్గించేందుకు సీపీ ఈ చర్యలు చేపట్టారు.
ప్రతి రోజు నగర సైబర్‌క్రైమ్ ఠాణాకు 40 నుంచి 50 ఫిర్యాదులు వస్తుండగా, ఫిర్యాదుల్లోని తీవ్రతను బట్టి సుమారు 10 కేసుల్లో ఎఫ్ఐఆర్లు నమోదవుతున్నా యి. గత ఏడాది మొత్తంలో 2,550 కేసులు కేవలం సైబర్ క్రైమ్ఠాణాలోనే నమోదయ్యాయి. ఈ ఏడాది కేవలం మూడు నెలల సమయంలోనే 850 కేసుల వరకు నమోదయ్యాయి. సైబర్‌క్రైమ్ రోజు రోజుకు పెరుగుతుండటంతో కమిషనరేట్‌కు ఉన్న ఒక్క సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దీంతో 2019లో నగరంలో ఉన్న అన్ని పోలీస్స్టేషన్లలో సైబర్ వింగ్స్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన చేశారు. అందు లో భాగంగా ఆయా పోలీస్స్టేషన్లలో పనిచేసే సిబ్బందికి సైబర్ నేరాల దర్యాప్తుపై శిక్షణ కూడా ఇచ్చారు. ఇటీవల కొత్తగా పోలీస్ శాఖలోకి ఉద్యోగంలోకి వస్తున్న కానిస్టేబుళ్లు, ఎస్సై స్థాయి అధికారులందరికీ దాదాపుగా టెక్నాలజీపై పట్టు ఉంటుంది. అలాగే బీటెక్, ఎంటెక్ చేసిన వారు కూడా ఉద్యోగంలో చేరారు.
అలాంటి వారిని ఎం పిక చేసి శిక్షణ ఇచ్చారు. 2020లో కరోనా కారణంగా ఈ విషయంపై అంతగా దృష్టి పెట్టలేదు. ఈ క్రమంలోనే నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ 2020 డిసెంబర్లో విడుదల చేసిన వార్షిక నివేదిక సందర్భంగా నగరంలో కొత్తగా సైబర్ విభాగాలు ఏర్పాటు చేసి, ప్రస్తుతం ఉన్న సైబర్‌క్రైమ్ ఠాణాపై ఒత్తిడి తగ్గిస్తామన్నారు. కొన్ని రోజుల క్రితం సైబరాబాద్‌లోని అన్ని ఠాణాల్లో సైబర్ ఫిర్యాదులు తీసుకునే వెసులుబాటును కల్పించారు. తాజాగా హైదారాబాద్ కమిషనరేట్‌లోని అన్ని పోలీస్స్టేషన్లలో సైబర్ ఫిర్యాదులు తీసుంటున్నారు.
సోషల్‌మీడియా ఫిర్యాదులు సైబర్ ఠాణాకే..
సైబర్ నేరగాళ్లు మోసంతో బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడం, బాధితులకు వివిధ రకాలైన ఆశలు చూపిస్తూ డబ్బులు డిపాజిట్ చేయించుకుంటూ ఆర్థిక పరమైన నేరాలకు పాల్పడుతున్నారు. అలాంటి నేరాల్లో లక్ష రూ పాయలలోపు ఎవరైనా నష్టపోతే నేరుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. ఇదిలాఉండగా సోషల్‌మీడియాకు సంబంధించిన ఫిర్యాదులు మాత్రం ప్ర స్తుతం కొనసాగుతున్నట్లుగానే సైబర్ఠాణాలోనే ఇవ్వా ల్సి ఉంటుంది. సోషల్‌మీడియాకు సంబంధించిన వాటి లో మహిళలకు సంబంధించిన వేధింపులు ఎక్కువగా ఉండటం, సున్నితమైన అంశాలతో కూడుకున్నవి ఉండటంతో సైబర్ఠాణాలోనే ఫిర్యాదు ఇవ్వాల్సి ఉంటుంది.
దర్యాప్తులో వేగం..
సైబర్‌ఠాణాలో ప్రస్తుతం నమోదవుతున్న కేసుల పరిశీలన జరుపుతుండగానే దర్యాప్తు అధికారులకు మరో కొత్త కేసు వచ్చేస్తోంది. దీంతో పాత కేసులపై దృష్టిపెట్టలేని పరిస్థితుల్లో అధికారులపై ఒత్తిడి నెలకొంది. అయితే ప్రతి రోజు సైబర్‌ఠాణాకు వచ్చే ఫిర్యాదుల్లో సగానికి సగం లక్ష రూపాయలలోపు ఉండే బాధితులే ఉంటారు. ఆయా ఫిర్యాదులు ఇక నగరంలోని అన్ని పోలీస్స్టేషన్లకు వెళ్తాయి. దీంతో కొత్తగా వచ్చే కేసుల సంఖ్య తగ్గడంతో,పెండింగ్‌లో ఉన్న కేసులపై వేగం పెంచనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

