నాకు కరోనా వస్తదా?

- వస్తే నా కుటుంబానికి దిక్కెవరు ?
- వారిని ఎవరు పట్టించుకుంటారు..
- పెరుగుతున్న మానసిక రుగ్మతులు
- పురుషుల్లోనే అధిక సమస్యలు
- ఆత్మహత్యల వైపు ప్రేరేపిస్తున్న ఆలోచనలు
- రాచకొండ కమిషనరేట్‌లో ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రం
- మానసిక సమస్యకు గురైతే 040-48214800 లో సంప్రదించాలి
సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ) : నాకు కరోనా వస్తుందా ? వస్తే పరిస్థితి ఏంది ? ఆక్సిజన్ అందక ఏమైనా ఇబ్బందయిద్దా ? ఒకవేళ ఏమైనా జరిగితే నా కుటుంబం పరిస్థితి ఏమిటి ? నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు ? ఇలాంటి అనుమానాలు, నెగెటివ్ ఆలోచనలతో చాలామంది మానసికంగా కుంగిపోతున్నారు. కరోనా రెండోదశలో వివిధ కారణాల వల్ల మృతుల సంఖ్య పెరుగుతుండడంతో మాకేమైనా అయితుందేమో..? అని లోలోపల మదనపడిపోతున్నారు. లాక్డౌన్ ఉండడం, ఖాళీ సమయం దొరకడంతో వ్యతిరేక ఆలోచనలతో మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. వారిలో వారే బాధపడుతూ ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వైపు మళ్లుతున్నారు. ఒకరు కాదు..ఇద్దరు కాదు వందలాదిమంది ఈ నెగెటివ్ థింకింగ్‌తో సతమతమవుతన్నారు. అత్యుత్సాహం, ఆత్రుత, తొందరపాటు వల్ల మానసిక వ్యాధుల బారిన పడుతున్నారు.
50 ఏండ్లు పైబడిన వారే..
మానసిక సంఘర్షణకు లోనవుతున్నవారు దాదాపు 50 ఏండ్లు దాటిన వారే అధికంగా ఉంటున్నారు. ఈ వయసు వారిలో అధికశాతం మందికి కుటుంబ బాధ్యతలు ఉండడం, పిల్లలు పెద్ద కావడం, తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి రావడంతో కరోనా వస్తే నాకేమైనా అయితదేమోనని తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఫలితంగా మానసిక సమస్యలతోపాటు రక్తపోటు(బీపీ), మధుమేహం (డయాబెటిక్) బారిన పడుతూ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.
15 రోజుల్లో 275 మంది
వ్యక్తిగత ఘర్షణ, మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న వారికోసం రాచకొండ పోలీసులు సైకో సోషల్ కౌన్సెలింగ్ పేరుతో ప్రత్యేకంగా హెల్ప్‌లైన్ సెంటర్‌ను ప్రారంభించారు. 040-48214800 సహాయక కేంద్రం ఏర్పాటు చేసి మానసిక వైద్యులు, కౌన్సెలర్లను నియమించారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు పనిచేస్తుంది. కేవలం 15 రోజుల్లో దాదాపు 275 మంది సహాయక కేంద్రానికి ఫోన్ చేశారు. వారి సమస్యలు, ఒత్తిడికి గల కారణాలు తెలుసుకొని వాటి నుంచి ఎలా బయటపడాలో మానసిక నిపుణులు పలు సూచనలు చేశారు. గతేడాది లాక్డౌన్లో కూడా దాదాపు 200 మందిని మానసిక సమస్యల నుంచి బయటపడేశారు.
రెండోదశలో గృహహింస తగ్గింది..
మొదటి దశ కరోనా, లాక్డౌన్ సమయంలో మహిళలు ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు సిద్ధమయ్యారు. రెండోదశలో రివర్స్ అయ్యింది. ఈసారి పురుషులు అధికంగా మానసిక ఒత్తిడికి గురవుతూ తమను కాపాడాలని సంప్రదిస్తున్నారు. వారికి కావాల్సిన కౌన్సెలింగ్ ఇస్తున్నాం. టీవీలలో ఆందోళనకర వార్తలు, సామాజిక మాధ్యమాల వాడకాన్ని తగ్గిస్తే చాలామంచిది. సమయానికి మంచి ఆహారం తీసుకోవడం, నెగెటివ్ ఆలోచన వచ్చినప్పుడు మంచి పుస్తకం లేదా సంగీతం, సినిమా చూస్తే ఆలోచన మారుతుంది. అమీనా నిలోఫర్ హుస్సేన్, మానసిక నిఫుణురాలు, రాచకొండ సైకో సోషల్ కౌన్సెలింగ్ కేంద్రం
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Covid Pandemic
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

