మహిళ దృష్టిమరల్చి.. ఏటీఎంలో నగదు చోరీ
మహిళ దృష్టిమరల్చి ఏటీఎంలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి నగదు చోరీ చేసిన సంఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం.. మల్కాజిగిరి నివాసి పుష్పలత ఈ నెల 25న ఈస్ట్ మారేడుపల్లి సెయింట్ జాన్స్ రోడ్డులోని
అడ్డగుట్ట, సెప్టెంబర్ 28 : మహిళ దృష్టిమరల్చి ఏటీఎంలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి నగదు చోరీ చేసిన సంఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం.. మల్కాజిగిరి నివాసి పుష్పలత ఈ నెల 25న ఈస్ట్ మారేడుపల్లి సెయింట్ జాన్స్ రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లింది. పలుమార్లు ప్రయత్నించగా ఏటీఎంలో నుంచి డబ్బులు రాకపోవడంతో పక్కనే ఉన్న గుర్తు తెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చాడు.
ఏటీఎంలో నుంచి తాను డబ్బు తీసి ఇస్తానని చెప్పి.. సదరు మహిళ ఏటీఎం కార్డు తీసుకొని ఆమె దృష్టి మరల్చి తన ఏటీఎంను ఆమెకు ఇచ్చాడు. డబ్బులు రావడం లేదని చెప్పడంతో.. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. దుండగుడు ఆమె ఏటీఎం కార్డు ద్వారా బ్యాంకులో నుంచి రూ.28,670లు డ్రా చేసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. తన ఖాతాలో నుంచి డబ్బులు డ్రా అయ్యాయని ఆలస్యంగా తెలుసుకున్న పుష్పలత బుధవారం తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

