Congress Sarpanch | తనను ఓట్లేసి గెలిపించిన గ్రామస్థులపైనే కర్రలతో దాడి చేశాడు ఓ కాంగ్రెస్ సర్పంచ్. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఆడ్లూరులో చోటుచేసుకుంది. ఆడ్లూరు గ్రామ సభలో నిధుల దుర్వినియోగంపై ప్రశ్నించినందుకు కాంగ్రెస్ సర్పంచ్, అతని బంధువులతో కలిసి గ్రామస్థులపై కర్రలతో దాడి చేశాడు.
కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గువ్వల శిరీష, వెంకట రమణ అధ్యక్షతన గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించగా.. నా సంతకాలు లేకుండా నిధులు ఏ విధంగా డ్రా చేస్తారని గ్రామ ఉపసర్పంచ్ ఉసిరికాయల శిరీష, సర్పంచ్ని ప్రశ్నించారు. ఈ క్రమంలో వాగ్వాదం మొదలైంది. దీంతో సర్పంచ్ భర్త వెంకటరమణ, వారి బంధువులు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థులపై దాడికి దిగారు. కర్రలతో విచక్షణా రహితంగా దాడులు చేసిన సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
అధికార మదంతో గ్రామస్థులపై కర్రలతో దాడి చేసిన కాంగ్రెస్ సర్పంచ్
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఆడ్లూరు గ్రామ సభలో నిధుల దుర్వినియోగం పై ప్రశ్నించినందుకు గ్రామస్థులపై కర్రలతో దాడి చేసిన కాంగ్రెస్ సర్పంచ్, అతని బంధువులు
కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గువ్వల శిరీష, వెంకట రమణ అధ్యక్షతన… pic.twitter.com/g7oQHybCjP
— Telugu Scribe (@TeluguScribe) March 30, 2026
Nithiin | లీడింగ్ బ్యానర్లో నితిన్ కొత్త సినిమా.. ఈసారైనా హిట్టు పడేనా..?
Hardik Pandya: మహికా శర్మకు 1.7 కోట్ల ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్ పాండ్యా