ఖైరతాబాద్, ఆగస్టు 7: పవిత్రమైన శ్రావణ మాసం సందర్భంగా సీఎంఆర్ జువెల్లరీ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ‘లెగసీ ఆఫ్ జూవెల్లరీ’గా ప్రసిద్ధిగాంచిన సీఎంఆర్ ఈ శ్రావణ మాస వేడుకల్లో భాగంగా సరికొత్త వెరైటీలు, వైభవోపేతమైన బంగారు ఆభరణాలతో మహిళలను ఆకట్టుకుంటోంది.
వరలక్ష్మి వ్రతం, శ్రావణ శుక్రవారాల వంటి పర్వదినాల కోసం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు సీఎంఆర్ శుభ శ్రావణ మాసంలో అద్భుతమైన ఆఫర్లు అందిస్తోంది. 916 బంగారు ఆభరణాల వీఏ చార్జీలపై ఫ్లాట్ 50 శాతం రాయితీ కల్పిస్తోంది. కొన్ని రకాల బంగారు ఆభరణాలపై తరుగు 25 శాతం తగ్గింపు, పాత బంగారం మార్పిడిపై రూ.250 అధికంగా పొందే అవకాశం, సిల్వర్ ఆర్టికల్స్‌పై తరుగు, మజూరీ మినహాయింపు, డైమండ్ వాల్యూపై 15 శాతం తగ్గింపు లాంటి ఆఫర్లను అందిస్తోంది.
వంద శాతం విశ్వసనీయత
సీఎంఆర్ అంటేనే విశ్వసనీయతకు మారుపేరు. నాలుగు దశాబ్దాలుగా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా విశేషమైన ఆభరణాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. మా లెటెస్ట్ వెరైటీలు, శ్రావణ మాసం ఆఫర్లు వినియోగదారులకు మరింత చేరువ చేస్తోంది. పూజలు, పండుగలు, వివాహాలు, వైదికతకు చిహ్నంగా నిలిచే బంగారు నగల కోసం సీఎంఆర్ బంగారు ఆభరణాలే విశ్వసనీయ ఎంపికగా నిలుస్తున్నాయి. వందశాతం నాణ్యత, 200 శాతం సంతోషమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ అఫర్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– అల్లక సత్యనారాయణ, సీఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ