CM KCR | తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగమవుతుందన్న వాళ్లకే ఇదే చెంప పెట్టు : సీఎం కేసీఆర్
CM KCR | తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగం అవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని ఆనాడు భయభ్రాంతులకు గురి చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఈ భూముల ధర వ్యవహారాన్ని హైదరాబాద్ ఆత్మగౌరవాన్ని కించపరిచిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా అర్థం చేసుకోవాలని స్పష్టం చేశారు
CM KCR | ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ భూములు ఎకరాకు రూ. 100 కోట్లకు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రపంచస్థాయి దిగ్గజ కంపెనీలు పోటీ పడి మరీ ఇంత ధర చెల్లించి తెలంగాణ భూములు కొనడాన్ని ఆర్థిక కోణంలో మాత్రమే కాకుండా తెలంగాణ సాధించిన ప్రగతి కోణంలో విశ్లేషించాలని ఆయన అన్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా హైదరాబాద్ నగర అభివృద్ధి సూచిక అందనంత ఎత్తుకు దూసుకుపోతున్న వర్తమాన పరిస్థితికి అద్దం పడుతున్నదని సీఎం తెలిపారు.
తెలంగాణ వస్తే హైదరాబాద్ ఆగం అవుతుందని, భూముల రేట్లు పడిపోతాయని ఆనాడు భయభ్రాంతులకు గురి చేశారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఈ భూముల ధర వ్యవహారాన్ని హైదరాబాద్ ఆత్మగౌరవాన్ని కించపరిచిన వారి చెంప చెళ్లుమనిపించే చర్యగా అర్థం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఎవరెంత నష్టం చేయాలని చూసినా ధృఢచిత్తంతో పల్లెలను, పట్టణాలను ప్రగతి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ పట్టుదలకు, హైదరాబాద్ వంటి మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషికి దక్కిన ఫలితమని అన్నారు. హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం అహర్నిషలు కృషి చేస్తున్న హెచ్ఎండీఏ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్‌ను కేసీఆర్ అభినందించారు.

కోకాపేటలో ఎకరానికి 100 కోట్లు
భూముల వేలంలో కోకాపేట కేక పుట్టించింది. ఒక ఎకరానికి వంద కోట్లకు పైగా పలికి రికార్డుల మోత మోగించింది. ఇది దేశంలోనే అత్యధిక ధరగా నమోదైంది. ఒక లేఅవుట్లో ఎకరం స్థలానికి ఇంత పెద్ద మొత్తంలో ధర పలికిన దాఖలాలు లేవని, కోల్‌కతా నగరంలో ఎకరం సుమారు రూ. 72 కోట్ల మేర మాత్రమే పలికిందని నిర్మాణ రంగ నిపుణులు తెలిపారు. కోకాపేట నియోపోలిస్ ఫేజ్-2లో గల 3.6 ఎకరాల ప్రైమ్ ప్లాట్‌ను హెచ్ఎండీఏ గురువారం వేలం వేసింది. ఆ స్థలాన్ని హ్యాపీ హైట్స్, రాజపుష్ప సంస్థలు కలిసి రూ.362.72 కోట్లకు దక్కించుకున్నాయి. ఈ చిన్న సైజు ప్లాటుకు సరిగ్గా గండిపేట లేక్ వ్యూ ఉండటం, ప్లాటుకు రెండు వైపులా విశాలమైన రహదారి, పక్కన విశాలమైన ఓపెన్ స్పేస్, ఔటర్ రింగురోడ్డుకు అతి సమీపంగా ఉండటంతో అనూహ్యమైన ధర పలికింది. ఈ స్థలంలో దాదాపు 45 అంతస్థుల వరకు హైరైజ్ భవనాలను నిర్మించి, కనీసం 210 వరకు ఫ్లాట్లను కట్టే అవకాశం ఉంది. ఈ స్థలాన్ని దక్కించుకునేందుకు దిగ్గజ స్థిరాస్తి కంపెనీలు పోటీ పడగా.. వాటిలో హైదరాబాద్‌కు చెందిన కంపెనీలే దక్కించుకోవడం మరో విశేషం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OTT Movies | ఈ శుక్రవారం ఓటీటీలో సందడి.. ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
Nandi Awards | నంది అవార్డుల ప్రదానోత్సవానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 9 ఏళ్ల పురస్కారాలు ఒకేసారి, డిసెంబర్లో గ్రాండ్ ఈవెంట్!
Hyderabad | ఖైరతాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
MG University | మహాత్మాగాంధీ యూనివర్సిటీ హాస్టల్లో విద్యార్థుల ఘర్షణ.. రెండు వర్గాలుగా విడిపోయి దాడులు
Allu Aravind | రుహానీ శర్మకు అల్లు అరవింద్ పెళ్లి సలహా.. హైదరాబాద్ అబ్బాయిని చూసుకోమంటూ కామెంట్స్.. !
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

