కనుల పండువగా..
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తాధ్వర్యంలో పది రోజుల పాటు పండుగ వాతావరణంలో జరిగిన దసరా షాపింగ్ బొనాంజా ఆహ్లాదంగా ముగిసింది. ప్రతి రోజూ విజేతలకు విలువైన బహుమతులు ప్రదానం చేసి వారిలో సంతోషాన్ని నింపింది. బంపర్ లక్కీ డ్రా ముగింపు కార్యక్రమం టూరిజం ప్లాజాలో శుక్రవారం ఘనంగా జరిగింది.
- వైభవంగా ముగిసిన దసరా షాపింగ్ బొనాంజా
- బంపర్ డ్రాలో నిక్సాన్ మెగ్నెట్
- కారును గెల్చుకున్న పీఎస్ మూర్తి
సిటీబ్యూరో, అమీర్‌పేట/ఖైరతాబాద్ : నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తాధ్వర్యంలో పది రోజుల పాటు పండుగ వాతావరణంలో జరిగిన దసరా షాపింగ్ బొనాంజా ఆహ్లాదంగా ముగిసింది. ప్రతి రోజూ విజేతలకు విలువైన బహుమతులు ప్రదానం చేసి వారిలో సంతోషాన్ని నింపింది. బంపర్ లక్కీ డ్రా ముగింపు కార్యక్రమం టూరిజం ప్లాజాలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ వేడుకలను ముఖ్య అతిథులుగా స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. బంపర్ డ్రాలో భాగంగా మంత్రి సత్యవతి రాథోడ్ కూపన్ తీయగా, అనిల్ రావిపూడి విజేతను ప్రకటించారు. బంపర్ డ్రాలో నిక్సాన్ మెగ్నెట్ కారును లాల్‌దర్వాజకు చెందిన పీఎస్ మూర్తి గెల్చుకున్నారు. మంత్రి స్వయంగా ఆయనకు ఫోన్ చేసి అభినందించారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికల కృషిని మంత్రి కొనియాడారు. కార్యక్రమంలో అడ్వర్టయిజింగ్ జీఎం సురేందర్‌రావు, సీజీఎం (ఆపరేషన్స్) శ్రీనివాస్, సర్క్యులేషన్ జీఎం రాంరెడ్డి, కేఫ్ నిలోఫర్ చైర్మన్ బాబురావు తదితరులు హాజరయ్యారు.
శాస్త్రీయ సంగీతం.. బతుకమ్మ పాటలు
దసరా బొనాంజా వేడుకకు ముందు ఏర్పాటు చేసిన శాస్త్రీయ సంగీతం ఆకట్టుకున్నది. అనంతరం కల్వకుర్తి నియోజకవర్గంలోని తాండ్రకు చెందిన కళాకారులు లక్ష్మమ్మ, సుశీల, అనసూయ, శాంత, కలమ్మ బృందం ఆలపించిన బతుకమ్మ పాటలు ఉత్సాహాన్ని నింపాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావం, సీఎం కేసీఆర్ త్యాగచరిత్రలను గేయ రూపంలో ఆలపించి అలరించారు. కాగా, వీరు ఇటీవల ఆలపించిన ‘గులాబీల జెండాలమ్మ.. గుర్తులా గుర్తించుకో….కారు గుర్తుంచుకో’ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
స్పాన్సర్లు వీరే..
నమస్తే తెలంగాణ, తెలంగాణ సంయుక్తంగా నిర్వహించి పది రోజుల దసరా బొనాంజా పండుగకు టైటిల్ స్పాన్సర్లుగా ది చెన్నై షాపింగ్ మాల్, ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్, ప్రధాన స్పాన్సర్లుగా సీఎంఆర్ ఫ్యామిలీ మాల్, కేఎల్ఎం ష్యాషన్ మాల్, గిఫ్ట్ స్పానర్లుగా బిగ్‌సీ మొబైల్స్‌తో పాటు కేఫ్ నిలోఫర్ సమర్పణ, క్రియేటివ్ పార్టనర్‌గా హోప్ అడ్వర్టయిజింగ్ ప్రైవేట్ లిమిటెడ్, టీవీ పార్టనర్‌గా టీన్యూస్, డిజిటల్ పార్టనర్‌గా హైబిజ్ టీవీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, నిస్సాన్, మహావీర్ గ్రూప్ (బెంజ్ అండ్ స్కోడా), కున్ హ్యుందాయ్, వెంకటరమణ మోటర్స్, వరుణ్ మోటర్స్, సుధాకర్ పైప్స్ అండ్ ఫిటింగ్, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కిసాన్ మాల్, జీబీఆర్ డెవలపర్స్, కలశా, వాల్యూ గోల్డ్ సంయుక్తాధ్వర్యంలో జరిగింది. చందనా బ్రదర్స్, మానేపల్లి జువెల్లర్స్, చర్మాస్, శ్రీ వేదిక్ ఎలక్ట్రానిక్స్, మురుగన్ వీల్స్ కేర్, దుర్గా కన్వెన్షన్, న్యూస్ కింగ్స్ వేర్, రామయ్య ఇనిస్టిట్యూట్స్, పీఎంఆర్ కాలేజెస్, పీఎస్ఆర్ కన్వెన్షన్, ఆంజనేయ జువెల్లర్స్, ఎంకేఆర్ డెవలపర్స్, ఇండో బ్రిటీష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, ఎస్ఆర్ఆర్ ఫార్చున్ ఇన్ఫ్రా, నమిశ్రీ బిల్డర్స్, లాస, లంస సహ సమర్పకులుగా వ్యవహరించాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

