నగర రోడ్లపైకి 2400 బస్సులు

- నేటి నుంచి రోజంతా సిటీ బస్సులు
- ప్రతి రోజూ బస్సుల శానిటైజేషన్
- తప్పనిసరిగా మాస్కులు ధరించాలి
- ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ ఈడీ
సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ శనివారం నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటి వరకు బోసి పోయిన నగర రోడ్లపై ఆదివారం నుంచి సిటీ బస్సులు సందడి చేయనున్నాయి. హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు పూర్తి స్థాయిలో తిప్పడానికి ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈడీ వీ. వెంకటేశ్వర్లు తెలిపారు. జీహెచ్ఎంసీ జోన్లో 2,400 సిటీ బస్సులను తిప్పడానికి నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతేకాకుండా విధుల్లోకి ఆరోగ్యవంతమైన డ్రైవర్లు, కండక్టర్లు మాత్రమే తీసుకుంటామని,కరోనా లక్షణాలు ఉన్న వారిని విధుల్లోకి తీసుకోమన్నారు. ప్రతి రోజూ బస్సులను శానిటైజేషన్ చేస్తామన్నారు. ప్రయాణికులు కూడా తప్పకుండా మాస్కులు ధరించి బస్సులు ఎక్కాలని ఆయన సూచించారు.
అన్ని కేంద్రాల్లో బస్సు పాసులు..
సిటీ బస్సుల్లో నిత్యం ప్రయాణం చేసే వారి కోసం నగరంలో ఏర్పాటు చేసిన 37 కేంద్రాల్లో బస్సు పాసులు జారీ చేస్తామని అధికారులు తెలిపారు. అలాగే జూలై 1 నుంచి విద్యా సంస్థలు తెరువనుండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా సిద్ధం చేస్తున్నామన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

