హైదరాబాద్ : హకీంపేటలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. హకీంపేట ఆర్మీ జంగల్లో కానిస్టేబుల్ చెట్టుకు వేలాడుతుండటాన్ని స్థానికులు గుర్తించి, పోలీసులకు సమచారం అందించారు. సీఐఎస్ఎఫ్ యూనిఫామ్‌లోనే కానిస్టేబుల్ ఉరేసుకున్నాడు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని రవీందర్‌గా గుర్తించారు. అనంతరం డెడ్‌బాడీని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. జవహర్‌నగర్ పరిధిలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రవీందర్.. రెండేండ్ల క్రితం సస్పెండ్ అయినట్లు పోలీసులు వెల్లడించారు. రవీందర్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.