Hyderabad | విషాదం.. మాంజా దారం మెడకు చుట్టుకొని సైనికుడు మృతి..!
Hyderabad | హైదరాబాద్‌లో దారుణ ఘటనలు చోటు చేసుకున్నాయి. సంక్రాంతి పండుగ వేళ ఎగురవేస్తున్న పతంగులతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వేర్వురు ఘటనలో ఇద్దరు మృతి చెందడంతో పండుగ వేళ విషాదం అలుముకున్నది.
Hyderabad | హైదరాబాద్‌లో విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయి. సంక్రాంతి పండుగ వేళ ఎగురవేస్తున్న పతంగులతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వేర్వురు ఘటనలో ఇద్దరు మృతి చెందడంతో పండుగ వేళ విషాదం అలుముకున్నది. పతంగులు ఎగురవేస్తూ భవనంపై కింద పడి యువకుడు తుదిశ్వాస విడిచారు. మాంజాదారం మెడకు చుట్టుకొని తీవ్ర గాయాలతో సైనికుడు ప్రాణాలను విడిచాడు.
వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నంకు చెందిన సైన్యంలో సేవలందిస్తున్న కోటేశ్వరరావు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. విధులు ముగించుకొని ఆయన ఇంటికి వెళ్తున్న సమయంలో లంగర్‌హౌస్‌పై వద్ద మెడకు మాంజా చుట్టుకున్నది. దీంతో కోటేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయను ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలకు గురైన ఆయన పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. అలాగే అల్వాల్‌లో యువకుడు భవనంపై నుంచి కిందపడ్డాడు.
మృతుడిని పేట్ బషీర్‌భాగ్ పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఏఎస్ఐ తనయుడు ఆకాశ్‌గా గుర్తించారు. పతంగుల కారణంగా గత రెండురోజుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పండుగ వేళ మృతుల కుటుంబాల్లో విషాదం అలుముకున్నది. చైనా మాంజాపై నిషేధం ఉన్న నిబంధనలకు విరుద్ధంగా పలువురు విక్రయిస్తున్నారు. పతంగులను ఎగురవేస్తూ ఇష్టారాజ్యంగా వదిలివేస్తుండడంతో మాంజాదారం ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే, పక్షులు సైతం బలవుతున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Laxma Reddy | జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Nanna Kutty | ‘నాన్న కుట్టి’ సినిమా రివ్యూ.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ జర్నీ ఆకట్టుకుందా?
RBI Gold Reserves | ఏడాదిలో 165 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. భారత్ వ్యూహమేంటి?
Jagapathi Babu | పనివాళ్ళతో కలిసి భోజనం చేసిన జగపతిబాబు.. స్టార్డమ్ పక్కనపెట్టి మనసులు గెలుచుకుంటున్న విలన్!
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

