అదృశ్యమైన చిన్నారి.. అనుమానాస్పద స్థితిలో మృతి

మియాపూర్ , సెప్టెంబర్ 13 : కనిపించకుండాపోయిన 13 నెలల బాలిక అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధి ఓంకార్నగర్లోని గుడిసెలో నివాసముండే రంగస్వామి, సుమలత దంపతుల కూతురు సోనీ ఆదివారం సాయంత్రం తోటి పిల్లలతో ఇంటి సమీపంలో ఆడుకుంటూ..అదృశ్యమైంది. కూతురు ఆచూకీ కోసం తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో 13 ఏండ్ల బాలుడు చిన్నారిని అపహరించాడని స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో తమ కూతురు కిడ్నాప్ అయిందని వారు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అదృశ్యం కేసు నమోదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. విచారణ చేపట్టడంతో పాటు సీసీ కెమెరాలను పరిశీలించారు.
ఇంటికి సమీపంలో..
సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో చిన్నారి మృతదేహం ఇంటికి సమీపంలో లభ్యమైనట్లు కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ వైద్యశాలకు తరలించారు. అయితే చిన్నారి ఒంటిపై ఎటువంటి గాయాలైన ఆనవాళ్లు లేవని, కడుపు, ముక్కు, చెవుల నిండా నీరు నిండి ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ఒకవేళ చిన్నారి ఆడుకుంటూ.. వెళ్లి నీటి గుంతలో పడి ఉంటే మృతదేహం అక్కడే ఉండాల్సి ఉండగా, అందుకు భిన్నంగా గుడిసె ముందు విగతజీవిగా పడి ఉన్నది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారిని ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని ఇంటి ముందు పడేసి వెళ్లారా? ఇంకేమైనా జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- child death case
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

