శివారు ప్రాంతాలే టార్గెట్
సిటీలోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో ఉండే మహిళల మెడలో నుంచి స్నాచర్లు బంగారు గొలుసు లాకెళ్లుతున్నారు. హైదరాబాద్ చుట్టూ పక్కల చాలా వరకు గ్రామీణ ప్రాంతాలున్నాయి.
- ఒంటరి మహిళపై స్నాచర్ల గురి భయాందోళనలో ప్రజలు
సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): సిటీలోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల్లో ఉండే మహిళల మెడలో నుంచి స్నాచర్లు బంగారు గొలుసు లాకెళ్లుతున్నారు. హైదరాబాద్ చుట్టూ పక్కల చాలా వరకు గ్రామీణ ప్రాంతాలున్నాయి. ఇండ్లకు, పొలాలకు మధ్య దూరం ఉండడంతో మహిళలు నడుచుకుంటూ వెళ్తుంటారు. పొలాల వద్ద ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉం టారు.
దుండగులు ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ అదును చూసి ఒంటరి మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులను ఎత్తుకెళుతున్నారు. గురువారం ప్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ షాద్‌నగర్ పరిధిలో పొలంలో కూర్చొని ఉన్న వీరమ్మ అనే మహిళ మెడలో నుంచి మధ్యాహ్నం సమయంలో బైక్‌పై వచ్చిన దుండుగులు నాలుగు తులాల బంగారు పుస్తెల తాడునే లాక్కొని పరారయ్యారు.
ఏడాది క్రితం కేశంపేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో పొలం నుంచి ఇంటికి వెళ్తున్న ఓ వృద్ధురాలి మెడలో నుంచి స్నాచర్లు బం గారు గొలుసును ఎత్తుకెళ్లారు. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నగరంతో పాటు సిటీ బయట వివిధ రాష్ర్టాలకు చెందిన వారు జీవనోపాధి కోసం వచ్చి ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇండస్ట్రిస్తో పాటు వ్యవసాయ పనుల్లోను ఆయా రాష్ర్టాలకు చెందిన వారు పాల్గొంటున్నారు. దీనిని ఆసరాగా చేసుకుంటూ అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ల ముఠాలు మహిళలను టార్గెట్ చేస్తున్నారు.
ఒక్కో పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకటి రెండు పెట్రోలింగ్ వాహనాలు, బ్లూకోల్ట్స్ వాహనాలు మాత్రమే ఉంటాయి. ఉదయం, సాయంత్రం పెట్రోలింగ్ వాహనాలు రౌండ్ కొట్టాయంటూ అదే ఎక్కువ అయిపోయిందనే భావనలో ఉంటారు. విజిబుల్ పోలీసింగ్‌తోనే స్నాచర్ల ఆటకట్టియవచ్చని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే గ్రామానికో పోలీసు అధికారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనుమానితులు ఎవరైనా ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలంటూ అందరిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని స్థానికులు చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Breast Cancer | రొమ్ము క్యాన్సర్‌కు విజయవంతంగా చికిత్స చేస్తే మళ్లీ వస్తుందా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Pressure Cooker | ప్రెషర్ కుక్కర్లో వంట చేస్తున్నారా.. రుచి తగ్గకుండా ఉండాలంటే ఇలా చేయాలి..
Gang robs women passengers | సిగ్నల్ ట్యాంపరింగ్‌తో రైలు నిలిపి.. మహిళా ప్రయాణికుల నుంచి బంగారం దోచుకున్న ముఠా
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

