చెత్త సేకరణ రాంకీకి వద్దు
గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంటింటి చెత్త సేకరణను రాంకీ సంస్థకు అప్పగించి స్వచ్ఛ ఆటో కార్మికుల జీవనోపాధిని దెబ్బతీయవద్దని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
- ఆటో కార్మికుల జీవనోపాధిని దెబ్బతీయొద్దు
- బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్
హిమాయత్‌నగర్,అక్టోబర్ 15: గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంటింటి చెత్త సేకరణను రాంకీ సంస్థకు అప్పగించి స్వచ్ఛ ఆటో కార్మికుల జీవనోపాధిని దెబ్బతీయవద్దని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ స్వచ్ఛ ఆటో టిప్పర్లు, రిక్షాడ్రైవర్ల జేఏసీ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల సమస్యలు-పరిష్కార మార్గాలు అనే అంశంపై గురువారం సోమాజి గూడలో ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
సామాజిక విశ్లేషకురాలు కె. సజయ అధ్యక్షతన ఈ రౌండ్‌టేబుల్ సమావేశానికి రాంబాబు యాదవ్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వం స్వచ్ఛ ఆటోలను అందుబాటులోకి తీసుకువచ్చి కార్మికులకు ఇచ్చారన్నారు. నగరంలో 30 ఏండ్లుగా ఇంటింటి చెత్త సేకరణ చేసే కార్మికులే వ్యాపార, ఇతర సంస్థల నుంచి చెత్త సేకరణ చేస్తున్నారని, కొంతకాలంగా రాంకీ సంస్థ వ్యాపార సంస్థల వద్ద చెత్త సేకరణ చేయకుండా స్వచ్ఛ ఆటో కార్మికులను అడ్డుకోవడం జరుగుతున్నదన్నారు.
చెత్త సేకరణను రాంకీ సంస్థకు అప్పగిస్తే దీనిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంటింటి చెత్త సేకరణను రాంకీ సంస్థకు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, కార్మికులు చేసే పోరాటానికి అండగా ఉంటామని తెలిపారు. ఇంటింటి చెత్త సేకరణను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించి కార్మికుల ఉపాధి దెబ్బతీసి వారి పొట్టకొట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే ఉద్యమాలతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మానవ హక్కుల నేత జీవన్‌కుమార్, జేఏసీ చైర్మన్ గోపి, ప్రతినిధులు వి.విరావు, రాజేందర్, వెంకన్న, జయలక్ష్మి, అనిల్, యాదగిరి పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

