Bonthu Ram Mohan | హాస్టల్ నిర్వాహకులపై బొంతు రామ్మోహన్ కుటుంబసభ్యుల దౌర్జన్యం.. కేసు నమోదు
Bonthu Ram Mohan | బొంతు రామ్మోహన్ హైదరాబాద్‌లోని అమీర్ పేట్లో ఏషియన్ హాస్టల్ నిర్వాహకులతో రూ.2 కోట్లు అడ్వాన్స్ రూపంలో తీసుకొని భవనాన్ని అద్దెకు ఇచ్చారు. అయితే బొంతు రామ్మోహన్, ఆయన కుటుంబసభ్యులు అకస్మాత్తుగా ఆ భవనాన్ని ఖాళీ చేయాలని హాస్టల్ నిర్వాహకులపై దాడి చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారు.
Bonthu Ram Mohan | హైదరాబాద్ మాజీ మేయర్, కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్‌తో తమకు ప్రాణహాని ఉందని.. సీఎం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని కాపాడండి.. అంటూ అమీర్ పేట్లో ఏషియన్ హాస్టల్ నిర్వాహకులు కోరుతున్నారు. హాస్టల్ నిర్వాహకుల వివరాల ప్రకారం.. బొంతు రామ్మోహన్ హైదరాబాద్‌లోని అమీర్ పేట్లో ఏషియన్ హాస్టల్ నిర్వాహకులతో రూ.2 కోట్లు అడ్వాన్స్ రూపంలో తీసుకొని భవనాన్ని అద్దెకు ఇచ్చారు.
అయితే బొంతు రామ్మోహన్, ఆయన కుటుంబసభ్యులు అకస్మాత్తుగా ఆ భవనాన్ని ఖాళీ చేయాలని హాస్టల్ నిర్వాహకులపై దాడి చేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. బొంతు రామ్మోహన్ అత్త హాస్టల్ నిర్వాహకురాలిని పోలీసుల ముందే జుట్టు పట్టుకొని కొట్టిన వీడియో ఇప్పుడు నెట్టింట్ వైరల్ అవుతోంది. అన్యాయంగా తమ డబ్బులు తీసుకొని భవనాన్ని ఖాళీ చేయమని కొడుతున్నారని, అక్రమ కేసులు బనాయించి పోలీసులను పంపించి భయపెడుతున్నారని హాస్టల్ నిర్వాహకుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బొంతు శ్రీదేవి 30 మంది రౌడీలతో హాస్టల్లో కూర్చొని భయబ్రాంతులకు గురి చేస్తుందని, నగరం నడిబొడ్డున ఇంత అరాచకం తగదని సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలని హాస్టల్ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. కాగా బొంతు రామ్మోహన్, అతని భార్య శ్రీదేవిపై కేసు నమోదైంది. ఏషియన్ హాస్టల్ నిర్వాహకులపై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ తో ప్రాణహాని ఉంది
రేవంత్ రెడ్డి గారు మమల్ని కాపాడండి
హైదరాబాద్ – అమీర్ పేట్లో ఏషియన్ హాస్టల్ నిర్వాహకులతో రూ.2 కోట్లు అడ్వాన్స్ రూపంలో తీసుకొని భవనాన్ని అద్దెకు ఇచ్చిన బొంతు రామ్మోహన్
అకస్మాత్తుగా ఆ భవనాన్ని ఖాళీ చేయాలని హాస్టల్ నిర్వాహకులపై దాడి… pic.twitter.com/dQGJagpTgX
— Telugu Scribe (@TeluguScribe) May 21, 2026
హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అతని భార్య శ్రీదేవిపై కేసు నమోదు
ఏషియన్ హాస్టల్ నిర్వాహకులపై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు https://t.co/TskB8FpMuj pic.twitter.com/uoDzvJDyQY
— Telugu Scribe (@TeluguScribe) May 21, 2026
Read Also :
Bandla Ganesh | మళ్లీ పవన్ కళ్యాణ్‌కి దగ్గరైన బండ్ల గణేష్ .. ‘మెగా 158’ వేదికపై వైరల్ అయిన సన్నివేశాలు
Padma Devender Reddy | రైతులు చనిపోయినా పట్టించుకోని ప్రభుత్వం : మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి
Tamil Nadu | తమిళనాడులో మంత్రివర్గ విస్తరణ.. 23 మందికి మంత్రివర్గంలో చోటు.. ఇద్దరు కాంగ్రెస్ నుంచి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

