గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంలో పేలుడు

అబిడ్స్, ఆగస్టు 10: గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంలో పేలుడు సంభవించి ఓ యువకుడు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ పరిధి ఠక్కెర్వాడీ ప్రాంతంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఠక్కెర్వాడీ ప్రాంతంలో వీరుసింగ్(50), సుచిత్రబాయి (45), మానవ్‌సింగ్ (22), షేరాసింగ్ (24)లు నివసిస్తుండగా.. ఇందులో గతంలో ఆటో నడిపే వీరుసింగ్ అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నాడు. పెద్ద సిలిండర్ల నుంచి గ్యాస్‌ను చిన్న సిలిండర్లలో నింపుతూ విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఆ మంటలు మరో సిలిండర్‌కు అంటుకోగా ఓ స్థానికుడు ఆ సిలిండర్‌ను రోడ్డుపైకి తీసుకురాగా అక్కడే పేలిపోయింది. దీంతో మానవ్‌సింగ్(22) అక్కడికక్కడే మృతి చెందగా.. వీరుసింగ్, సుచిత్రబాయి, షేరాసింగ్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, గోషామహల్ ఏసీపీ ఎం. నరేందర్‌రెడ్డి, మంగళ్‌హాట్ ఇన్స్పెక్టర్ జి.రణవీర్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. మృతి చెందిన మానవసింగ్ను ఉస్మానియాకు తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- blasting
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

