పీర్జాదిగూడలో తగ్గిన వీధి కుక్కల బెడద
పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కలను నియంత్రించేందుకు పాలకవర్గం చర్యలు చేపట్టింది. కుక్కల బెడద ఎక్కువ కావడం, ప్రయాణికులపై దాడులు చేయడంతో ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు
ఆపరేషన్‌తో అదుపు
మూడు విడుతల్లో 3,433 వీధి కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు ..
హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు
పీర్జాదిగూడ, ఏప్రిల్ 17 : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో వీధి కుక్కలను నియంత్రించేందుకు పాలకవర్గం చర్యలు చేపట్టింది. కుక్కల బెడద ఎక్కువ కావడం, ప్రయాణికులపై దాడులు చేయడంతో ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దీంతో మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. వీధికుక్కల సంతాన నియంత్రణకు రూ.30 లక్షలు వెచ్చించి పర్వతాపూర్ డంపింగ్‌యార్డులో ఎనిమల్ హెల్త్‌కేర్ సెంటర్‌ను నిర్మించారు.
ఆపరేషన్ ఇలా…
పీర్జాదిగూడ పరిధిలో వీధి కుక్కలను పట్టుకుని రెండు, మూడురోజుల వరకు పశు వైద్యశాలలో ఉంచిన తర్వాత సంతాన నియంత్రణ ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ తరువాత కూడా నాలుగు రోజులు అక్కడే ఉంచుతారు. వాటి ఆరోగ్యం మెరుగుపడిన తరువాత ఎక్కడి నుంచో తీసుకువచ్చారో అక్కడే విడిచిపెడుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతిరోజు 20 కుక్కల వరకు ఆపరేషన్లు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆపరేషన్ అయినట్లు గుర్తించడానికి ప్రతి శునకానికి ‘వి’ గుర్తును వేస్తున్నారు. కార్పొరేషన్లో కుక్కల బెడద తగ్గుముఖం పట్టడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రేబిస్ సోకకుండా టీకాలు…
నగరపాలకలో కుక్కలకు ఇతర అనారోగ్య సమస్యలున్నా వాటిని గుర్తించి చికిత్స అందిస్తున్నారు. సంతాన నివారణ ఆపరేషన్ చేసిన ప్రతి కుక్కకు రేబిస్ సోకకుండా టీకా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సెంటర్లో ఇద్దరు వెటర్నరీ డాక్టర్లు, సిబ్బంది రోజూ పర్యవేక్షిస్తున్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు
వీధి కుక్కలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 3,433 కుక్కలకు మూడు విడుతల్లో సంతాన నియంత్రణ ఆపరేషన్ చేశాం. కుక్కలకు ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యం అందిస్తున్నాం. సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సతో పాటు రేబిస్ సోకకుండా టీకాలు వేస్తున్నాం. –బి.హృతిక , వెటర్నరీ డాక్టర్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

