పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ

తెలుగు యూనివర్సిటీ, మే 22: పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని జీవ వైవిధ్య మండలి రాష్ట్ర కార్యదర్శి కాళీచరణ్ అన్నారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవంను పురస్కరించుకొని తెలంగాణ జీవ వైవిధ్య మండలి, సాగర్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంయుక్తంగా ఆన్లైన్లో పెయింటింగ్, ఫొటోగ్రఫీ, వ్యాసరచన, నృత్యం, కార్టూన్ డిజైన్, క్విజ్, ఫ్యాన్సీడ్రెస్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల విజేతలతో కూడిన పోస్టర్‌ను సైఫాబాద్‌లోని అరణ్యభవన్‌లో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాళీచరణ్ మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా ఈ వేడుకలను ఆన్లైన్ వేదికగా నిర్వహించామన్నారు. జీవ వైవిధ్యంపై 9 అంశాల్లో పోటీలు నిర్వహించగా 5600మంది పాల్గొన్నట్లు తెలిపారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాగర్సాఫ్ట్వేర్ సొల్యూషన్ సీఈఓ జోగి రితేశ్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- biodiversity
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

