కొవిడ్ వ్యర్థాలపై లేబుల్ ఉండాల్సిందే..

- వాటిని ప్రత్యేకంగా పరిగణించాలి
- సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేశాకే తరలించాలి
- నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే..
- బయో వ్యర్థాల నిర్వహణపై పీసీబీ అవగాహన
- దవాఖానలు, ఐసోలేషన్ వార్డుల నిర్వాహకులకు ఆదేశాలు
రోజు రోజుకు కొవిడ్ రోగుల సంఖ్య నగరంలో విపరీతంగా పెరుగుతోంది. రాష్ట్రంలోనూ వీరి సం ఖ్య పెరుగుతున్న కొద్దీ కొవిడ్ వ్యాధిగ్రస్తుల వల్ల బయో వ్యర్థాలు అధికంగా ఉత్పన్నమవుతున్నా యి. ఈ క్రమంలోనే నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేల టన్నుల బయో వ్యర్థాలు కామన్ బయోవేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలిస్తున్నారు. కాని, దవాఖానలలో, ఐసోలేషన్ వార్డులలో, హోం ఐసోలేషన్ వార్డుల నుంచి ఉత్పత్తి అయిన బయోవేస్ట్‌ను సక్రమంగా నిర్వహించకుంటే ఇబ్బందులు తప్పవని వైద్య నిఫుణులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు హెచ్చరిస్తున్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో, కొవిడ్ వ్యాధిగ్రస్తుల నుంచి వెలువడిన వ్యర్థాలను సీపీసీబీ నిబంధనల ప్రకారం నిర్వహించకుంటే తీవ్రమైన దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే, ఎలాంటి బయో వ్యర్థాలను ఏఏ రంగు డబ్బాలలో వేయాలనే అంశంపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
నాలుగు రంగుల డబ్బాలు…
సీపీసీబీ సూచనల మేరకు ప్రతి దవాఖానలో, ప్రతి ఐసోలేషన్ వార్డులో సుమారు నాలుగు రకాల రంగు డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలని సీపీసీబీ జారీ చేసిన కొవిడ్-19 బయోవేస్ట్ మార్గదర్శకాలలో స్పష్టం చేసింది. పసుపు, ఎరుపు, నీలి, తెలుపు రంగు డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. ఎరుపు, పసుపు రంగులున్న డబ్బాలలో 50 మైక్రాన్ల కన్నా ఎక్కువ మందమున్న నాన్ క్లోరినేటెడ్ ఆయా రంగుల క్లోరినేటెడ్ బ్యాగులను వాడాలి.
ఇలా చేయాలి…
- వాడిన గాగుల్స్, ఫేస్ షీల్డ్, మరకలు, తుంపర్ల నుంచి రక్షించే యాప్రాన్, ప్లాస్టిక్ కవరాల్, హజ్మెట్ సూట్, నైట్రిల్ గ్లౌవ్స్, పీపీఈలను ఎరుపు రంగు డబ్బాలో వేయాలి.
- వాడిన మాస్కులు, హెడ్ కవర్, క్యాప్, షూ కవర్, డిస్పోజబుల్ లైనెన్ గౌను, నాన్ ప్లాస్టిక్, సెమీ ప్లాస్టిక్ కవర్లను పసుపు రంగు డబ్బాలో వేయాలి.
- ఈ వ్యర్థాలను తరలించే వాహనాలకు కొవిడ్-19 వ్యర్థాలు అని బోర్డు ఏర్పాటు చేయాలి.
- పదును తేలి ఉండే వ్యర్థాలను, లోహ వ్యర్థాలను తెల్లరంగు డబ్బాలో వేయాలి.
- అన్ మెటాలిక్ పరికరాలను నీలం రంగు డబ్బాలో వేయాలి.
- డబ్బాలలో తగిన మోతాదులో సోడియం హైపో క్లోరైట్‌ను వేసి క్రిమిరహితం చేయాలి.
- ఈ ప్రక్రియను వేరువేరుగా చేయాలని, వాడిన టెస్టింగ్ కిట్లను అటోక్లేవ్ చేసిన తరువాత వ్యర్థాల డబ్బాలలో వేయాలని పీసీబీ అధికారులు సూచిస్తున్నారు.
- ఇలా చేసిన తరువాత ప్రతిరోజు వెలువడిన బయో వ్యర్థాలను ‘కామన్ బయోవేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్’ సిబ్బందికి అప్పగించాలని, కొవిడ్ 19 రోగులుండే ఐసోలేషన్ వార్డులోని జీవ వ్యర్థాలను ప్రత్యేక లేబుల్ అంటించిన డబ్బాలో వేసి గ్రామ పంచాయతీ, యూఎల్బీ సిబ్బందికి అప్పగించాలని పీసీబీ రాష్ట్రంలోని దవాఖానలకు, ఐసోలేషన్ కేంద్రాలకు ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్ వ్యర్థాల నిర్వహణను ప్రతి ఒక్కరు పక్కాగా పాటించాలని లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- bio waste management
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

