Engineering | అబిడ్స్, ఆగస్టు 11: ఇంజినీరింగ్ విద్యలో మెథడిస్ట్ కాలేజీకి ఉన్న పేరు ప్రఖ్యాతలు అన్నీఇన్నీ కావు. ఎన్బీఏ అక్రిడిటేషన్, న్యాక్, స్వయం ప్రతిపత్తి హోదా సాధించిన ఈ కాలేజీ రాష్ట్రంలోని ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల సరసన నిలుస్తున్నదంటే అతిశయోక్తి కాదు. నగరం నడిబొడ్డున 2008లో స్థాపించిన మెథడిస్ట్ ఇంజినీరింగ్ కళాశాలకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. కళాశాల కరస్పాండెంట్ కె.కృష్ణారావు విద్యార్థులకు నాణ్యమైన వృత్తి విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటుండటంతో ప్రతి ఏడాది ఉత్తీర్ణత శాతం పెరుగుతున్నది.
ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధంతో విశాలమైన స్థలంలో కాలేజీ స్థాపించిన యాజమాన్యం విద్యార్థులకు అత్యాధునిక తరగతులు, వేలాది పుస్తకాలతో లైబ్రరీ హాల్, డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటుతోపాటు విశాలమైన కాన్ఫరెన్స్ హాల్‌ను నిర్మించారు. అనుభవం ఉన్న ప్రొఫెసర్లు, పీహెచ్‌డీలు, ఫ్యాకల్టీల ద్వారా విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన అందిస్తున్నారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఇక్కడి విద్యార్థులు ఓయూ స్థాయిలో గోల్డ్‌మెడల్స్ సాధించడంతోపాటు పలు ర్యాంకులు సాధించి కళాశాల పేరు ప్రతిష్టలను పెంపొందిస్తున్నారు. అంతేగాక ఇంజినీరింగ్ పూర్తి కాగానే క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థానాల్లో స్థిరపడుతున్నారు.
మెథడిస్ట్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు తప్పకుండా ఉద్యోగం లభించేలా కళాశాల యాజమాన్యం, కళాశాల కరస్పాండెంట్ కె.కృష్ణారావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ కళాశాలలో ప్రారంభించినప్పటి నుంచి ప్రతి ఏడాది విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా ఉద్యోగాలు సాధిస్తూనే ఉన్నారు. దేశ, విదేశాలకు చెందిన పలు కార్పొరేట్, సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉన్నత హోదాల్లోని ఉద్యోగాలకు ఎంపిక అవుతూ అత్యధిక ప్యాకేజీ పొందుతుండటం విశేషం.
మెథడిస్ట్ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రతి సంవత్సరం దేశ, విదేశాలకు చెందిన కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్లు నిర్వహిస్తున్నాయి. రకుటెన్, హెచ్‌పీ, డీటెక్ డిజిటల్, సేల్స్‌ఫోర్స్, టెక్ మహీంద్రా, అమెజాన్, హెచ్‌సీఎల్, ఎస్ఏపీ, బ్లూ సీ ఇండస్ట్రీస్, జీనోసిస్, విప్రో, ఐబీఎం, హిందుస్థాన్ గ్లోబల్, ఐసీఐసీఐ, జెన్‌ప్యాక్ట్ తదితర కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్ నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేస్తున్నాయి. సీనియర్ విద్యార్థులు తమ ప్రతిభాపాటవాలతో ఉన్నతస్థాయిల్లో ర్యాంకులు, ఉద్యోగాలు సాధిస్తుండటంతో జూనియర్ విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుతున్నారు.
మా కళాశాలలోని విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. ఉద్యోగాల సాధనకు ప్రత్యేక తరగతుల నిర్వహణతోపాటు ఉద్యోగ ప్రవేశ పరీక్షల్లో సునాయాసంగా నెగ్గేలా శిక్షణ ఇప్పిస్తున్నాం. ఈ క్యాంపస్‌లో తరగతి గదులు, అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌లు, వేలాది పుస్తకాలతో లైబ్రరీ సదుపాయాన్ని కల్పిస్తున్నాం. కళాశాలకు సకాలంలో చేరుకునేలా రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణతా శాతం పెంచడంతోపాటు ప్లేస్మెంట్ సైతం కల్పిస్తున్నాం.
మెథడిస్ట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏఐ డేటా సైన్స్ కోర్సులో చేరిన నేను ప్రొఫెసర్లు, ఫ్యాకల్టీ ప్రోత్సాహంతో సేల్స్‌ఫోర్స్‌లో సాలీనా 9 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాన్ని సాధించాను. ఇంజినీరింగ్ విద్యా బోధనతోపాటు ప్రత్యేక తరగతులను నిర్వహించి క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో నెగ్గేలా కాలేజీ యాజమాన్యం నన్ను తీర్చిదిద్దారు. నగరంలో కాలేజీ ఉండటంతో గంటల తరబడి ప్రయాణం చేసే సమయం తగ్గడంతోపాటు సమయానికి కాలేజీకి చేరేవాళ్లం.
– అర్చన, పూర్వ విద్యార్థి
మెథడిస్ట్ ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్ఈ కోర్సును పూర్తి చేసి టీటెక్లో ఉద్యోగాన్ని సాధించా. ఫ్యాకల్టీ ప్రోత్సాహం, ప్లేస్మెంట్ ట్రైనింగ్.. ఉద్యోగం రావడానికి ఎంతో ఉపయోగపడ్డాయి. రోజు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతోపాటు ప్రవేశ పరీక్షల్లో ఎలా మెదులుకోవాలో శిక్షణ ఇచ్చే వారు. ఎక్కడ ఉద్యోగ ఖాళీలు ఉన్నా ఫ్యాకల్టీలు తమకు సమాచారం ఇచ్చే వారు. ఫ్యాకల్టీ ప్రోత్సాహం ఉద్యోగ సాధనకు దోహదపడింది.
– ప్రవళిక, పూర్వ విద్యార్థి