దేశంలోనే ప్రముఖ డిజైనర్ల కలెక్షన్లతో మోడల్స్ సందడి చేశారు. కండ్లుచెదిరే అందాలు.. ఆకట్టుకునే దుస్తులతో బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ బుధవారం ప్రారంభమైన హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్ ఎంతగానో ఆకట్టుకున్నది.
బంజారాహిల్స్,డిసెంబర్ 7: దేశంలోని ప్రముఖ డిజైనర్లు రూపొందించిన కలెక్షన్లతో మోడల్స్ సందడి చేశారు. కండ్లు చెదిరే అందంతో పాటు ఆకట్టుకునే లేటెస్ట్ డిజైనర్ దుస్తులను ధరించి ర్యాంప్‌పై హొయలు ఒలికించారు. బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్‌లో బుధవారం ప్రారంభమైన హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్ ఎంతగానో ఆకట్టుకుంది. ప్రముఖ డిజైనర్ మందిరా విర్క్ రూపొందించిన లగ్జరీ వేర్‌ను ఫెమినా మిస్ ఇండియా -2022 సిని షెట్టితో పాటు మోడల్స్ ప్రదర్శిస్తూ ర్యాంప్ వాక్ చేశారు. డి
జైనర్లు అలియా, కౌశిక్ కొచ్చర్, దీప్తిరెడ్డి, కాంచీపురం నారాయణి సిల్క్స్, డి రాయల్ సహా 16మంది డిజైనర్లు రూపొందించిన వస్ర్తాలు ఈ ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శిస్తున్నారు. గురువారం కూడా ఫ్యాషన్ వీక్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో సందడి చేస్తున్న మోడల్స్