సంబురంగా సద్దుల బతుకమ్మ

- పూలవనంగా మహానగరం
- తీరొక్క బతుకమ్మలతో కొత్త కళ
- ఆటపాటలతో దద్దరిల్లిన వీధులు
- సౌభాగ్యాలివ్వమంటూ గౌరమ్మకు వీడ్కోలు
భాగ్యనగరం పూలవనమైంది.. ఆడపడుచుల ఆనందం ఉప్పొంగింది.. సద్దుల సంబురం నింగినంటింది.. తొమ్మిదిరోజుల వేడుక కనులపండువగా ముగిసింది..వెళ్లు గౌరమ్మా.. మళ్లీ రావమ్మా అంటూ మహిళా లోకం వినమ్రంగా వేడుకుంది. రోజుకో రీతిలో సాగిన బతుకమ్మ ఉత్సవాలు సద్దుల బతుకమ్మతో బుధవారం సాయంత్రం ముగిశాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయ వైభవాన్ని చాటాయి.

ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్ బతుకమ్మ ఘాట్, కర్బలా మైదానం, అంబేద్కర్‌నగర్, అంబర్‌పేట, కూకట్పల్లి గ్రామం లో వేలాది బతుకమ్మలు కొలువుదీరాయి. ఆడబిడ్డల ఆటపాటలతో మహానగర వీధులు మార్మోగాయి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉద్యోగినులు బతుకమ్మ ఆడి సందడి చేశారు. సౌభాగ్యాలివ్వమని, మహమ్మారి రాకుండా చూడాలంటూ గౌరీదేవిని వేడుకుంటూ బతుకమ్మలను ఘనంగా సాగనంపారు. మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుటుంబసభ్యులతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
యాడాదికోసారి.. నువ్వొచ్చి పోవమ్మా

భాగ్యనగరంలో బుధవారం సద్దుల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తీరొక్క పూలతో అలకరించిన బతుకమ్మలతో వీధి వీధిన పూల సింగిడి విరబూసింది. కోలాటాలు, దాండియాలతో ఆడబిడ్డలు ఆడిపాడగా, మహిళల చప్పట్లతో వాడలన్నీ మారుమోగాయి. ప్రభుత్వ కార్యాలయాలల్లో ఉద్యోగినులు, సిబ్బంది బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

