కొవిడ్ కాలం.. బ్యాచిలర్లకు కష్టం…

- అద్దె గదులు ఇవ్వడానికి జంకుతున్న ఇంటి యజమానులు
- ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉండొద్దనే షరతులే ఎక్కువ
- నలుగురున్న వారిని ఖాళీ చేయాలంటూ డిమాండ్
- చేసేదేమీలేక ఇద్దరు ఇద్దరుగా విడిపోతున్న స్నేహితులు
నిర్లక్ష్యం, అపరిశుభ్రతను సాకుగా చూపుతూ నగరంలోని పలు ప్రాంతాల్లోని ఇంటి ఓనర్లు బ్యాచ్‌లర్స్‌కు ఇంటిని అద్దెకు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. యువకులు, బ్రహ్మచారుల కారణంగానే కొవిడ్ ప్రబలుతుందని ఇంట్లో కిరాయికి ఉండేవాళ్లను సైతం యజమానులు వెళ్లగొడుతున్నారు. ఫ్యామిలీ సభ్యులైతే అన్ని రకాలుగా భద్రంగా ఉంటారనే మీమాంసలో ఇల్లు గలవారు ఇండ్లండ్ల నుంచి బ్యాచ్‌లర్స్‌ను ఖాళీ చేయిస్తున్నారు. కరోనా కాలంతో బ్రహ్మచారులకు భలే కష్టం వచ్చింది.
“అది హిమాయత్‌నగర్‌లోని ఓ ఇల్లు. సింగిల్ బెడ్ రూం అద్దె రూ.7,500. నలుగురు స్నేహితులు ఉంటారు. తలా కొంత చెల్లించి నెల అద్దె కట్టేవారు. అయితే, ఇప్పుడు కరోనా కష్టాలు మొదలయ్యాయి. దీంతో ఇంటి యజమాని నలుగురికి బదులు ఇద్దరే ఉండాలని షరతులు విధించాడు. చేసేదేమీ లేక ఆ గది ఖాళీ చేసి మరో గదిలోకి మారారు. అయితే, అక్కడా అదే పరిస్థితి ఉండటంతో ఓ స్నేహితుడు మరో ప్రాంతంలోని స్నేహితుల గదిలోకి మారాల్సి వచ్చింది.”
“సికింద్రాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్లో మూడో ఫ్లోర్ మొత్తం బ్యాచిలర్స్‌కే కేటాయించేవారు. కాని, ఇప్పుడు ఓన్లీ ఫ్యామిలీకే అంటూ బోర్డు పెట్టారు.” ఇలా నగరంలో చాలా ప్రాంతాల్లో బ్యాచిలర్స్‌కు గదులు అద్దెకు దొరకడం గగనమైంది. ఇద్దరికి మించి ఎక్కువ ఉండకూడదన్న షరతులు పెడుతున్నారు. కరోనా పరిస్థితుల్లో బ్యాచిలర్స్ రాకపోకలు రోజులో అధికంగా ఉంటాయని ఇంటి యజమానుల భావన. ‘ఏం కాదులే’ అనే ఓవర్ కాన్ఫిడెన్స్ అధికంగా ఉంటుందని రాజేశ్వర్ రెడ్డి అనే ఇంటి యజమాని తెలిపారు.
- ‘రూం అద్దె కట్టాలంటే.. నలుగురు తలా కొంత చెల్లిస్తే కాని, నెల గడవదు.’
- ఇదీ బ్యాచిలర్స్ పరిస్థితి. చదువు, ఉద్యోగం కోసం నగరానికి వచ్చిన బ్యాచిలర్స్ అద్దె ఇండ్లలో ఉంటూ జీవనం సాగిస్తారు.
- కాని, కరోనా కష్టాలు వారికి రెట్టింపు బాధను మిగిల్చాయి. అద్దె గదులు దొరకక సతమతమవుతున్నారు.
- కనికరం లేని కొంతమంది యజమానులు ఉన్న ఇంట్లో నుంచి ఖాళీ చేయిస్తున్నారు.
- బ్యాచిలర్స్ ఎక్కువగా బయట తిరగడం వలన కొవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఓనర్లు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు.
- చేసేదేమి లేక కిరాయి ఎక్కువైనా చెల్లించి ఖరీదైన రూంల్లో నివాసం ఉంటున్నామని బ్యాచిలర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అద్దెలు అధికం..!!
- అసలే కొవిడ్ క్లిష్ట పరిస్థితులు.
- సింగిల్ రూం అద్దె రూ.6 వేలకు పై మాటే.
- కొన్ని ప్రాంతాల్లో అంతకన్నా ఎక్కువే.
- సాధారణంగా సికింద్రాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ముషీరాబాద్, యూసఫ్‌గూడ, దిల్సుఖ్నగర్, ఉప్పల్, నాగోల్ తదితర ప్రాంతాల్లో అద్దెకు ఉండే వారు ఎక్కువగా ఉంటారు.
- ఒకే గదిలో కనీసం ముగ్గురు నుంచి ఆపై ఐదుగురి వరకు రూంలు షేర్ చేసుకుంటుంటారు.
- కొన్ని గదులు ఇరుకుగా ఉన్నా అడ్జస్ట్ అవుతారు.
- కాని, ఇప్పుడు కొవిడ్ వ్యాప్తి ఇంటి యజమానులను వణికిస్తోంది.
- గదులు ఖాళీగా ఉన్నా, ఫరవాలేదు అనే భావనలో ఉంటున్నారు.
- ఫ్యామిలీ అయితే జాగ్రత్తలు తీసుకుంటారనే అభిప్రాయం వారిలో ఉంది.
- బ్యాచిలర్స్ జాగ్రత్తలను పెద్దగా పట్టించుకోరని, పరిశుభ్రత పాటించడంలో నిర్లక్ష్యం చేస్తారని శంకర్ అనే ఓ ఇంటి ఓనర్ వివరించారు.
- గదులు దొరకక కొంతమంది సొంతూర్లకు వెళ్లిపోతున్నారు.
వాళ్లు ఒకప్పుడు బ్యాచిలర్సే..
ఉప్పల్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఐదుగురం కలిసి ఉంటున్నాం. అయితే, ఇక నుంచి ముగ్గురే ఉండాలని ఓనర్ చెప్పాడు. జన సంచారం ఎక్కువగా ఉన్న అపార్ట్మెంట్లలో కిరాయి గదులను బ్యాచిలర్స్‌కు ఇవ్వొద్దని తీర్మానం చేసుకుంటున్నారు. ప్రధానంగా బ్యాచిలర్స్ అంటే అన్నిటిని లైట్ తీసుకుంటారని, పరిశుభ్రదత విషయంలో సీరియస్ తీసుకోరని వారు అభిప్రాయపడుతుంటారు. కాని, వాళ్లు ఒకప్పుడు బ్యాచిలర్స్‌గా జీవించే వచ్చారనే విషయం మర్చిపోతున్నారు. చేసేదేమి లేక మిగిలిన ఇద్దరు స్నేహితులు ఈ ఏరియాలోనే మరో గదిని అద్దెకు తీసుకున్నారు. – నగేశ్, ఉప్పల్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Bachelors
- Rented room
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

