హయత్‌నగర్‌లో సినీతారలు ఆషికా రంగనాథ్, అమృతా అయ్యర్ సందడి చేశారు. భాగ్యలత కమాన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్‌ను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.
అనంతరం అభిమానులకు అభివాదం చేసి.. ఫొటోలకు పోజులిచ్చారు. కార్యక్రమంలో సీఎంఆర్ ఫౌండర్ అండ్ చైర్మన్ వెంకటరమణ, ఎండీ మోహన్ బాలాజీ, కార్పొరేటర్ నవజీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
– వనస్థలిపురం, ఫిబ్రవరి 29