మరో అంతర్జాతీయ ఒప్పందం

వ్యవసాయ యూనివర్సిటీ, సెప్టెంబర్ 20 : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ మరో అంతర్జాతీయ సంస్థ ఆఫ్రికన్-ఆసియన్ రూరల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(ఏఏఆర్డీవో)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధిలో పరస్పరం సహకారంతో కలిసి పని చేయనున్నాయి. ఈ మేరకు సోమవారం ఆన్లైన్లో జరిగిన సమావేశంలో వర్సిటీ, సంస్థ అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఎంతో గొప్పగా ఉందని ఏఏఆర్డీవో సెక్రటరీ జనరల్ మనోజ్ నార్ డియోసింగ్ అన్నారు. తెలంగాణతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఏఆర్డీవో సలహాదారు ఆర్పీ సింగ్, వీసీ ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

