హైదరాబాద్ : నగరంలోని ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ యువతిపై కత్తి దాడి జరిగింది. ప్రేమోన్మాది దాడిలో గాయపడిన యువతి పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పెళ్లికి నిరాకరించిందని బాధితురాలిపై బస్వరాజు అనే యువకుడు కత్తితో దాడి చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.