సతీమణికి ఘనమైన స్వాగతం
ఆ మహిళా కానిస్టేబుల్ ఏడాదిన్నర పసిబిడ్డను వదిలి పోలీస్ శిక్షణకు వెళ్లాల్సి వచ్చింది.. 45 రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది.. ఎట్టకేలకు శిక్షణ పూర్తి చేసుకొని హెడ్‌కానిస్టేబుల్‌గా ఇంటికి తిరిగొచ్చింది.
- కానిస్టేబుల్ శిక్షణకు వెళ్లిన భార్య
- పదోన్నతి పొంది ఇంటికిరాగా సర్ప్రైజ్
- బాజాభజంత్రీలు, తీన్మార్ డ్యాన్సులు,
- పటాకులు కాల్చి సంబురం
వెంగళరావునగర్, జూలై 21: ఆ మహిళా కానిస్టేబుల్ ఏడాదిన్నర పసిబిడ్డను వదిలి పోలీస్ శిక్షణకు వెళ్లాల్సి వచ్చింది.. 45 రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది.. ఎట్టకేలకు శిక్షణ పూర్తి చేసుకొని హెడ్‌కానిస్టేబుల్‌గా ఇంటికి తిరిగొచ్చింది. భార్య ఇంటికి తిరిగొస్తుంటే మామూలుగా ఉండొద్దని అనుకున్నాడా భర్త. తీన్మార్ డ్యాన్సులు, బాజాభజంత్రీలు పెట్టించి, పటాకులు కాల్చి, అర్ధాంగికి అపూర్వ స్వాగతం పలికి సర్ప్రైజ్ ఇచ్చాడు. దీంతో భర్త ప్రేమకు ఆమె ఉబ్బితబ్బిబ్బై ఆనందబాష్పాలు రాల్చింది. హైదరాబాద్‌లోని ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే కంపా డీనా.. ఎర్రగడ్డలోని ప్రేమ్‌నగర్‌లో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. భర్త రోనాల్డ్ బాసిల్ సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఏడాదిన్నర కుమారుడు అశర్ ఉన్నాడు. డీనాకు ఇటీవలే హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి లభించింది. దీంతో 45 రోజుల పాటు కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు వెళ్లింది. శిక్షణ పూర్తయ్యి ఇంటికి వస్తుండటంతో ఆమెకు వెరైటీగా గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని.. అంబరాన్నంటేలా సంబురాలు చేశాడు. ఇరుగుపొరుగువారు కూడా పూలదండలతో సత్కరించారు. డీనా ఇంట్లో అడుగుపెట్టాక కేక్‌కట్ చేయించి తినిపించాడు. ఈ వేడుకను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో 10లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

