Crime | వట్టినాగులపల్లిలో యువతిపై కత్తితో దాడిచేసిన ఉన్మాది

శేరిలింగంపల్లి : అర్థరాత్రి అక్రమంగా ఇంట్లోకి చొరబడి బెడ్రూంలో నిద్రిస్తున్న యువతిపై ఓ ఉన్మాది కత్తితో దాడికి పాల్పడ్డాడు. యువతి అరుపులతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు సదరు ఉన్మాదిని పట్టుకొని చితకబాదారు. కత్తిపోట్లతో గాయాలకు గురైన యువతి, కుటుంభసభ్యుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఉన్మాది వేర్వేరు దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు.
స్థానికంగా కలకలం సృష్టించిన ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జీడిమెట్ల ప్రాంతానికి చెందిన బాయన ప్రేమ్ సింగ్ (21) కేపీహెచ్‌బీ కాలనీలోని ఏంఎన్ఆర్ కళాశాలలో డీగ్రీ చదువుతున్నాడు. ప్రేమ్సింగ్కి దూరపు బందువు వట్టినాగుల పల్లికి చెందిన ఓ యువతి (21) మాదాపూర్‌లోని శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో అర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్ చదువుతుంది.
కాగా బుధవారం ఆర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో వట్టినాగులపల్లిలోని సదరు యువతి ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డ ప్రేమ్‌సింగ్ బెడ్రూంలోకి ప్రవేశించి యువతిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసి ప్రేమ్‌సింగ్‌ను అడ్డుకునేందు కు ప్రయత్నించింది. యువతి అరుపులు విన్న ఆమె కుటుంబసభ్యులు ఉన్మాది ప్రేమ్‌సింగ్‌ను పట్టుకొని చితకబాదారు.

ఈ దాడిలో యువతికి గొంతుబాగంతో పాటు చేయి, అరచేయి, మణికట్టు బాగాల్లో కత్తి గాయాలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం సమీపంలోని కాంటినెంటల్ హాస్పటల్‌కు తరలించారు. యువతి కుటుంబం చేతిలో ప్రేమ్‌సింగ్‌కు తలకు గాయమై కొండాపూర్‌లోని కిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నాడు.
ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, వీరికి ముందు ఎమైన పరిచయం ఉందా…లేదా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు పేర్కొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

