ప్రైమరీ నుంచే పటిష్ట పునాది
చారిత్రక, వారసత్వ కట్టడమైన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు విద్యను అందిస్తున్నది. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ నుంచే విద్యార్థులకు విభిన్న అంశాలను బోధిస్తూ ఏయే అంశాల్లో వారికి అభిరుచి ఉందో ఆయా రంగాల్లో మొదటి నుంచే ప్రోత్సహిస్తున్నారు.
- విద్య, మనోవైజ్ఞానిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై బోధన
- ప్రపంచస్థాయికి విద్యార్థులను తీర్చిదిద్దుతున్న హెచ్‌పీఎస్
- సులువుగా గుర్తుండేలా యాక్టివిటీస్
- హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ శతవసంతోత్సవాలు
సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ) : చారిత్రక, వారసత్వ కట్టడమైన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులకు విద్యను అందిస్తున్నది. ప్రీ ప్రైమరీ, ప్రైమరీ నుంచే విద్యార్థులకు విభిన్న అంశాలను బోధిస్తూ ఏయే అంశాల్లో వారికి అభిరుచి ఉందో ఆయా రంగాల్లో మొదటి నుంచే ప్రోత్సహిస్తున్నారు. అధునాతన లైబ్రరీ, వివిధ స్థాయిల్లో అకడమిక్ పుస్తకాలను డిజిటల్ రూపంలోకి మార్చి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రత్యేకమైన తరగతులు, క్రీడా ప్రాంగణాలు ప్రైమరీస్థాయి నుంచే విద్య, మనోవైజ్ఞానిక, సామాజిక, సాంస్కృతిక అంశాలపై బోధన.. విద్యార్థులను ప్రపంచస్థాయికి తీర్చిదిద్దుతున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు ఈ ఏడాది జనవరి నుంచి మొదలైన శతవసంతోత్సవాలు ఏడాది పొడవునా కొనసాగుతున్నాయి.
సెన్స్ దినోత్సవం..
సెన్స్ ఆర్గాన్స్ (ఇంద్రియాలు)కు సంబంధించిన లోతైన విషయాలను విద్యార్థులకు తెలియజెప్పేందుకు సెన్సెస్ డేను నిర్వహిస్తున్నారు. శరీరంలోని ఇంద్రయ జ్ఞానాన్ని ప్రాథమిక స్థాయిలోనే తెలియజెప్పేందుకు విద్యార్థులు కృషి చేస్తున్నారు. విద్యార్థుల ద్వారా చిత్రాలు వేయించడం, జ్ఞానేంద్రియాల గురించి ఒక్కొక్కటిగా వివరించడంతో మర్చిపోకుండా చెప్పగలిగే సామర్థ్యం విద్యార్థులకు పెంపొందుతున్నది.
సంస్కృతిని పెంపొందిస్తూ..
భారతీయ సంస్కృతిని పెంపొందించే విధంగా పాఠశాల విద్యార్థులకు చిన్నప్పటి నుంచే వివిధ అంశాల్లో తర్ఫీదును ఇస్తారు. ఇందుకోసం దీపావళి లాంటి పండుగలు వచ్చినప్పుడు ప్రమిదల తయారీ లాంటి విషయాల్లో విద్యార్థులను మమేకం చేస్తున్నారు.
జీవిత చరిత్రలు, నవలలు..
అకడమిక్ పుస్తకాలతోపాటు పలువురి జీవిత చరిత్రలు, భారత స్వాతంత్య్ర సమరయోధుల గూర్చి తెలిపే రచనలు, మహాత్మాగాంధీ, భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లాభాయ్ పటేల్, అంబేద్కర్, జూనియర్ మార్టిన్ లూథర్ కింగ్, ఇందిరాగాంధీ, అంగ్‌సాన్ సూకీలాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనేక వ్యక్తుల గురించి విద్యార్థులకు నచ్చిన పుస్తకాలు చదివిస్తూ.. ఆయా అంశాలతో పునశ్చరణ నిర్వహిస్తారు. వీటితోపాటు విద్యార్థుల ఎదుగుదలకు తోడ్పాటునందించే మరిన్ని నవలలను అందుబాటులో ఉంచారు. కథల రూపంలో వారికి గుర్తుండిపోయేవిధంగా ఆసక్తిగా చెబుతున్నారు.
రంగుల దినోత్సవం..
పింక్ డే, రెడ్, ఎల్లో, గ్రీన్ లాంటి రంగుల దినోత్సవాలు నిర్వహించి ఒక్కో రంగులో ఉండే విశిష్టతల గూర్చి వివరిస్తారు. వివిధ బులెటిన్ బోర్డులు జీవితంలో రంగుల ప్రభావాన్ని వర్ణించే పోస్టర్లను ప్రదర్శించే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. పెయింటింగ్, కలరింగ్ కార్యకలాపాలు పిల్లలలో రంగు భావనను బలోపేతం చేస్తాయని ఉపాధ్యాయులు తెలియజేశారు. ఇవేకాకుండా ప్రైమరీ సెక్షన్లలో ఫ్యాన్సీ డే, వరల్డ్ స్మైలీ డే, ట్రాన్స్పోర్ట్డే, మై పెట్ డే, డ్రాయింగ్ డే, ఫీదర్డ్ ఫ్రెండ్స్ (పక్షులు), వివిధ రకాలు క్రీడలు, కమ్యూనిటీ హెల్పర్స్, స్టోరీ టెల్లింగ్, పేరెంట్స్-చిల్డ్రన్ సెలెబ్రేషన్ డే లాంటి యాక్టివిటీలను నిర్వహిస్తూ విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలోనే బాగా గుర్తుండిపోయే విధంగా తీర్చిదిద్దుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

