Hyderabad | పోర్న్‌కు బానిసైన తండ్రి.. కూతురుపైనే కన్నేశాడు.. కాదన్నందుకు ఖతం చేశాడు..
Hyderabad | మద్యానికి బానిసై... నిత్యం అశ్లీల చిత్రాల చూస్తూ తన కామ వాంఛ తీర్చుకునేందుకు ఏకంగా కన్న కూతురిపైనే కన్నేశాడు. వావి వరసలు మరిచి తన వాంఛను తీర్చమని కోరటమే కాకుండా... కాదన్నందుకు ఏకంగా సొంత కూతురినే అతి కిరాతకంగా హత్య చేశాడు తండ్రి.
Hyderabad | హైదరాబాద్ : మద్యానికి బానిసై.. నిత్యం అశ్లీల చిత్రాల చూస్తూ తన కామ వాంఛ తీర్చుకునేందుకు ఏకంగా కన్న కూతురిపైనే కన్నేశాడు. వావి వరసలు మరిచి తన వాంఛను తీర్చమని కోరటమే కాకుండా… కాదన్నందుకు ఏకంగా సొంత కూతురినే అతి కిరాతకంగా హత్య చేశాడు తండ్రి. ఆపై ఏమీ ఎరగనట్లు తన కూతురు కనిపించకుండా పోయిందంటూ పోలీసులను తప్పుదోవ పట్టించేలా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మియాపూర్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ దుర్గా రామలింగ ప్రసాద్, ఎస్ఐ రాజులతో కలిసి మియాపూర్ ఏసీపీ నర్సింహారావు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మియాపూర్ నడిగడ్డ తండాకు చెందిన బానోతు నరేష్(35) తన కూతురు (13) అదృశ్యం అయినట్లు ఈ నెల 7వ తేదీన మియాపూర్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. 13వ తేదీన నడిగడ్డ తండా సమీపంలోని చెట్ల పొదల్లో కుళ్లిపోయిన స్థితిలో ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆనవాళ్ల ప్రకారం తప్పిపోయిన బాలిక(13)గా కుటుంబ సభ్యులు గుర్తించారు. హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయి విచారణతో పాటు సీసీటీవీ పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు.
బాలిక తండ్రి నరేష్ తన కూతురును వంట చెరుకు తీసుకువద్దామని చెప్పి తన బైక్‌పై నడిగడ్డ తండా సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లినట్లు గుర్తించారు. అక్కడ తన కామ వాంఛను కూతురుకు చెప్పటంతో వ్యతిరేకించి బిగ్గరగా అరిచింది. తన దురాలోచన గురించి కూతురు అందరికీ చెబుతుందన్న భయంతో జుట్టు పట్టి నేలకేసి కొట్టాడు. ముక్కులో నుంచి రక్తం కారుతూ అపస్మారక స్థితిలో పడిన అనంతరం పక్కనే ఉన్న బండరాయితో తలపై కొట్టడంతో బాలిక అక్కడి కక్కడే మృతి చెందింది.
అనంతరం తన ద్విచక్ర వాహనంపై కొంత దూరం వెళ్లిన నిందితుడు నరేష్ కూతురు మరణించిన విషయాన్ని ధృవీకరించుకునేందుకు మరోమారు ఘటనా స్థలానికి వెళ్లి నిర్ధారించుకున్నాడు. ఇక ఇంటికి వెళ్లిన నిందితుడు నరేష్ కూతురు కనిపించటం లేదంటూ భార్యకు చెప్పి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. తండ్రే నిందితుడని తేల్చారు. ఈ మేరకు నిందితుడు నరేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

