సిటీబ్యూరో: చర్లపల్లిలో టెక్నికల్ మేనేజర్‌గా పనిచేస్తున్నట్లు నకిలీ ఐడీ కార్డును సృష్టించిన కేటుగాడు.. బాధితురాలి కుటుంబాన్ని కలిసి పెండ్లి సంబంధం ఖాయం చేసుకున్నాడు. రూ. 1.5 కోట్ల వరకట్నం కుదర్చుకున్నాడు. నిశ్చాతార్ధం కూడా జరిగిన తరువాత ఆమె క్యారెక్టర్‌పై నిందలు వేస్తూ ఇబ్బందులు పెడుతూ మరింత కట్నం డిమాండ్ చేశారు. అతడి వ్యవహారంపై అనుమానం వచ్చిన బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యులు అతడి గురించి ఆరా తీశారు.
అసలు అతడు ఉద్యోగం చేయడం లేదని, అతడి వద్ద ఉన్నవి నకిలీ ఐడీ కార్డులను గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. ప్రభుత్వ ఉద్యోగులమంటూ నకిలీ గుర్తింపు కార్డులతో, సూటు బూటు వేసి బిల్డప్ ఇస్తూ సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఉన్నత విద్యావంతులనే లక్ష్యంగా చేసుకొని హానీ ట్రాప్‌లకు పాల్పడుతున్నారు. కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారు. పెండ్లి సంబంధాలు నిర్ణయించే సమయంలో అటు అమ్మాయి, ఇటు అబ్బాయికి సంబంధించిన పూర్తి వివరాలను తల్లిదండ్రులు తెలుసుకున్న తర్వాతే నిర్ణయానికి రావాలని పోలీసులు సూచిస్తున్నారు.