కోకాపేటలో నిబంధనలను తుంగలో తొక్కుతూ.. నిర్మాణాలు చేపడుతున్నా.. టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. 250 గజాల స్థలంలో కేవలం జీ ప్లస్ 2 నిర్మాణం చేపట్టాల్సి ఉన్నా..
నిబంధనలకు విరుద్ధంగా కొందరు ఏకంగా 8,9 అంతస్తులను కడుతున్నారు. గత కొన్నాళ్లుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నా.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
– మణికొండ, మే 18