పైసా ఖర్చు లేకుండా.. దేహదారుఢ్యం
కొలెస్టరాల్‌ను తగ్గించుకుంటూ.. కండలు పెంచుతున్నారు. ఆరోగ్యానికి నగరవాసులు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో జీహెచ్ఎంసీ ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నది. నెలకు వేలల్లో ఫీజులు చెల్లించి దేహదారుఢ్యాన్ని మలుచుకునే పరిస్థితికి దూరంగా
- జీహెచ్ఎంసీ జిమ్‌లకు మస్తు ఆదరణ
- కమ్యూనిటీ హాల్స్‌లో 135 ఆధునిక ఫిట్నెస్ కేంద్రాలు

సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ ) : కొలెస్టరాల్‌ను తగ్గించుకుంటూ.. కండలు పెంచుతున్నారు. ఆరోగ్యానికి నగరవాసులు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో జీహెచ్ఎంసీ ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తున్నది. నెలకు వేలల్లో ఫీజులు చెల్లించి దేహదారుఢ్యాన్ని మలుచుకునే పరిస్థితికి దూరంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా జీహెచ్ఎంసీ ముఖ్యమైన పార్కులు, ఖాళీ స్థలాల్లో ఓపెన్ జిమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
వివిధ కమ్యూనిటీ హాల్స్, సంక్షేమ సంఘాల్లో 135 ఆధునిక జిమ్‌లు/ఫిట్నెస్ కేంద్రాలు ఉండగా, బహిరంగ ప్రదేశాల్లో 135 చోట్ల ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేశారు. జోనల్ స్థాయిలో వీటి నిర్వహణ జరుగుతున్నది. ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ఆధునిక జిమ్‌లు, ఓపెన్ జిమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 270 జిమ్‌లు ఉన్నాయని, రాబోయే రోజుల్లో వీటి సంఖ్యను పెంచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ప్రైవేట్ కంటే బెటర్..!!
జీహెచ్ఎంసీ పార్కుల్లో ఏర్పాటు చేసిన జిమ్‌లో అత్యాధునిక వ్యాయామ పరికరాలు ఉన్నాయి. ఎయిర్వాకర్, ఎయిర్ స్వింగ్, షోల్డర్ వీల్, లెగ్ప్రెస్, ఫుల్చైర్, స్టాండింగ్ ట్విస్టర్, డబుల్ క్రాస్ వాకర్, ఎల్లిప్టికర్ ఎక్సర్సైజ్, లెగ్లిఫ్ట్, సిట్టింగ్ ట్విస్టర్ ఉంటున్నాయి.
ఈ ఓపెన్ జిమ్‌ల పట్ల యువత, చిన్నారులు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.
వాకింగ్ వచ్చిన వారు కాసేపు వ్యాయామం చేసిన తర్వాతనే ఇళ్లకు వెళ్తున్నారు.
వేలకు వేలు పోసి ప్రైవేట్ జిమ్‌లకు వెళ్లే కంటే జీహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకువచ్చిన ఓపెన్ జిమ్‌లు బెటర్ అని అంటున్నారు.
ఓపెన్‌జిమ్ ఎంతో ఉత్సాహంగా ఉన్నదని, రోజంతా పనిచేసినా హుషారుగా ఉంటున్నామని స్థానికులు చెబుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

