ఆస్తుల పంపకాలు పరిష్కారం అవుతాయి. పాతబాకీలు వసూలు అవుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. పలుకుబడి పెరుగుతుంది. కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. భూ వ్యవహారాలు లాభిస్తాయి. సహోద్యోగుల సహకారంతో ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. అధికారుల మన్ననలు అందుకుంటారు. శివాలయాన్ని సందర్శించండి.
పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఇంట్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సుదీర్ఘ చర్చలకు దూరంగా ఉండటం మంచిది. బంధువర్గంతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. రామరక్షాస్తోత్రం పఠించండి.
అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అదృష్టం కలిసివస్తుంది. చేసిన పనికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరిగినప్పటికీ సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. ఆస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
స్నేహితుల ప్రోద్బలంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. సత్ఫలితాలను పొందుతారు. బంధుమిత్రుల వల్ల కార్యసిద్ధి ఉంది. ఖర్చులు పెరగవచ్చు. నలుగురికీ సాయం అందిస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. సమాజంలో గుర్తింపు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార లావాదేవీలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన వారం. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి అవకాశాలు వస్తాయి. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.
కొత్త వ్యాపారం మొదలుపెట్టడంపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సాయం అందిస్తారు. దీర్ఘకాలిక పనుల విషయంలో ఆటంకాలు రావచ్చు. వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరుతారు. బంధువర్గం సహకారం లభిస్తుంది. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. విహారయాత్రలకు వెళ్తారు. న్యాయ సమస్యలు పరిష్కారం అవుతాయి. హనుమాన్ చాలీసా పఠించండి.
ఆస్తుల మూలంగా ఆదాయం వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. భూ వ్యవహారాల్లో సమస్యలు ఏర్పడవచ్చు. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. సద్వినియోగం చేసుకుంటే ఈ వారం అన్ని విధాలుగా లాభాన్ని పొందుతారు. పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఈశ్వరారాధన శుభప్రదం.
దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రుణ బాధలు పెరగవచ్చు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఓపికతో పనులను పూర్తిచేసుకోవడం మంచిది. స్నేహితుల వల్ల ఖర్చులు పెరగవచ్చు. విద్యార్థులు చదువుపై మనసు నిలపాలి. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం అవసరం. వ్యాపారంలో అదృష్టం కలిసివస్తుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్తారు. లక్ష్మీధ్యానం మేలు చేస్తుంది.
భూ లావాదేవీలు లాభదాయకంగా సాగుతాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు కలిసివస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కుటుంబసభ్యులతో కలిసి విందులకు హాజరవుతారు. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. ఆర్థికపరమైన చికాకులు ఎదురుకావచ్చు. రాబడిని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు చేయడం అవసరం. వారాంతంలో శుభవార్త వింటారు. దత్తాత్రేయస్వామి స్తోత్రాలు పఠించండి.
వివాదాలకు దూరంగా ఉంటారు. న్యాయ సమస్యలు తీరుతాయి. దైవ దర్శనానికి ప్రాధాన్యం ఇస్తారు. అలసట లేకుండా పనులు చేస్తారు. మనశ్శాంతికి ప్రాధాన్యం ఇస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. అప్పగించిన బాధ్యతలను సంయమనంతో నిర్వర్తిస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వృథా ఖర్చులు ఉంటాయి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపారులకు మిశ్రమ కాలం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివారాధన మేలు చేస్తుంది.
ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆలోచించి పనులు చేపడతారు. శుభకార్యాలు చేస్తారు. రోజువారీ వ్యాపారం కలిసివస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. కుటుంబసభ్యులతో కలిసి విందులకు హాజరవుతారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహన మరమ్మతులు ముందుకు వస్తాయి. భూ వ్యవహారంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఓపిక అవసరం. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. పిల్లల విషయంలో ఆందోళన చెందుతారు. ఆత్మవిశ్వాసం చాలా అవసరం. ప్రయాణాల విషయంలో ఏమరుపాటు తగదు. పెద్దల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందివచ్చిన అవకాశాలు చేజారకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం. సహోద్యోగులను కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేయండి. వారం ద్వితీయార్ధంలో పరిస్థితిలో మార్పు వస్తుంది. బంధుమిత్రుల సహాయంతో కార్యసాఫల్యం ఉంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రామాలయాన్ని సందర్శించండి.
బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సొంత ఆలోచనతో వ్యాపారం చేస్తారు. కుటుంబసభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. సాహిత్య సభలకు హాజరవుతారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. వృథా ఖర్చులు ఉంటాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. అనుభవజ్ఞుల సహకారంతో పనులు నెరవేరుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. హనుమాన్ చాలీసా పఠించండి.
-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in