Weekly Horoscope | ఈ వారం రాశి ఫలాలు.. ఏప్రిల్ 19.4.2026 నుంచి 25.4.2026 వరకు
ఇంట్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. భూ వ్యవహారాలు ఇబ్బంది కలిగించవచ్చు. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. గణపతి ఆలయాన్ని సందర్శించండి.
మేషం
ఇంట్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. భూ వ్యవహారాలు ఇబ్బంది కలిగించవచ్చు. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువర్గంతో సఖ్యత పెరుగుతుంది. వ్యాపార భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చుల నియంత్రణ అవసరం. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. గణపతి ఆలయాన్ని సందర్శించండి.
వృషభం
ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కార్యనిర్వహణలో సంయమనం అవసరం. పనిచేసే విధానంలో మార్పువల్ల అభివృద్ధి కలుగుతుంది. పాతబాకీలు వసూలు అవుతాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలు అందుతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు. శివారాధన శుభప్రదం.
మిథునం
వివాదాలకు దూరంగా ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ప్రోత్సాహంతో పనులు నెరవేరుతాయి. సత్ఫలితాలను పొందుతారు. మంచి అవకాశాలు వస్తాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. ప్రత్యేకమైన పనులు వాయిదా పడవచ్చు. వారాంతంలో పరిస్థితులు సానుకూలం అవుతాయి. రామాలయాన్ని సందర్శించండి.
కర్కాటకం
ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఉల్లాసంగా ఉంటారు. పిల్లల చదువు విషయంలో కలిసివస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాల వల్ల కార్యసిద్ధి ఉంది. దత్తాత్రేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.
సింహం
కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. నలుగురిలో మంచిపేరును సంపాదిస్తారు. పురాణ ప్రవచనాలకు హాజరవుతారు. అన్ని విధాలుగా అనుకూలమైన సమయం. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పొందుతారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. ఆర్థికస్థితి ఆశాజనకంగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పఠించండి.
కన్య
శుభకార్య ప్రయత్నాలలో బంధువుల సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రోజువారీ కార్యకలాపాల్లో స్వల్ప ఆటంకాలు రావచ్చు. రెట్టింపు శ్రమ అవసరం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. వ్యాపార భాగస్వాములతో వివాదాలు తలెత్తవచ్చు. బంధువర్గంతో ఆప్యాయంగా ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులపై మనసు నిలుపుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
తుల
న్యాయ సమస్యలు తీరతాయి. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. నలుగురికి సహాయపడే మనస్తత్వం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. తోటివారితో మనస్పర్ధలు రావచ్చు. భూ వ్యవహారం లాభిస్తుంది. హనుమత్ ఆరాధన శుభప్రదం.
వృశ్చికం
తీర్థయాత్రలు, విహారయాత్రలు చేపడతారు. కోర్టు సమస్యలు తీరతాయి. రుణబాధలు ఉంటాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంపై దృష్టి సారించాలి. విద్యార్థులు చదువుపై మనసు నిలపాలి. బంధుమిత్రులతో కొన్ని పనులు నెరవేరుతాయి. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. లలితాదేవి స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు
సహోద్యోగులతో స్నేహం పెరుగుతుంది. పనితనానికి గుర్తింపు లభిస్తుంది. రోజువారీ పనులు కలిసి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యంగా ఉంటారు. పెద్దల సూచనలు పాటించడం అవసరం. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వారాంతంలో శుభవార్త వింటారు. విద్యార్థులకు అనుకూల సమయం. శివాలయాన్ని సందర్శించండి.
మకరం
పనిలో బాధ్యతలు పెరుగుతాయి. సంయమనంతో పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో సఖ్యత పెరుగుతుంది. న్యాయ సమస్యలు తీరుతాయి. రాజకీయ ప్రభుత్వ పనులలో ఖర్చులు ఉంటాయి. ఆర్థికంగా సంతృప్తికరంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. భూ వ్యవహారం లాభదాయకంగా ఉంటుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.
కుంభం
సోదరులతో వివాదాలు సమసిపోతాయి. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వృథా ఖర్చులతో ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. పిల్లల చదువు, వివాహం, శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆలోచనలను కార్యరూపంలో పెడతారు. వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. వారాంతంలో శుభవార్త వింటారు. ఇష్టదైవాన్ని పూజించండి.
మీనం
సమయ పాలన లేకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. ప్రయాణాలు కలిసివస్తాయి. బంధుమిత్రుల సహకారంతో కార్యసాఫల్యం ఉంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణాలను చేపడతారు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. బాధ్యతతో మెలగడం అవసరం. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.
-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

