వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. అందరి సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. పలుకుబడి పెరుగుతుంది. విద్యార్థులకు కలిసివస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. స్థిర, చరాస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సహోద్యోగులతో చికాకులు ఉండవచ్చు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శివారాధన మేలుచేస్తుంది.
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. సమాజంలో గుర్తింపు పొందుతారు. పనుల్లో బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. వివాదాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వారాంతంలో శుభవార్త వింటారు. వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించండి.
కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. స్థిరమైన ఆలోచనలు ఆచరణలో పెడతారు. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. పెద్దల సలహాలు పాటిస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. అధికారుల అండదండలు లభిస్తాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. రాబడి పెరుగుతుంది. వారాంతంలో అనుకోని ఖర్చులు ఉంటాయి. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
తలచిన పనులు నలుగురి సహకారంతో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల సూచనలను పాటించడం వల్ల కార్యసాఫల్యం ఉంటుంది. ఇంటా, బయటా సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. అందరితో చర్చించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన చేస్తారు. ప్రభుత్వ పనులు అనుకూలంగా ఫలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. గణపతి ఆరాధన శుభప్రదం.
ఆత్మీయుల సహకారం లభిస్తుంది. భూములు, వాహనాల విషయంలో ఖర్చులు పెరుగుతాయి. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అనుకూల సంబంధాలు నెలకొంటాయి. అధికారులతో స్నేహంగా ఉంటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. రాబడి పెరుగుతుంది. అందుకు తగ్గ ఖర్చులూ ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారులు కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి స్పందించాలి. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఉత్సాహంగా ఉంటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. లక్ష్మీదేవి ఆరాధన మేలుచేస్తుంది.
ఈ వారం అన్ని రకాలుగా కలిసివస్తుంది. వృత్తివ్యాపారాల్లో సంతృప్తిగా ఉంటారు. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు మెరుగవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. విహారయాత్రలు చేస్తారు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. భూ లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాలి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి. రోజువారీ వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా, బయటా సంతృప్తికర వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలపై మనసు నిలుపుతారు. సహోద్యోగులతో సఖ్యత నెలకొంటుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. కొత్త పరిచయాలతో కార్యసిద్ధి ఉంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సూర్యారాధన శుభప్రదం.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆస్తి వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. కోర్టు ఫలితాలు అనుకూలంగా వెలువడుతాయి. పట్టుదలతో కార్యాలు చక్కబెడతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకుసాగుతాయి. శివాలయాన్ని సందర్శించండి.
తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక ప్రయోజనం చేకూరుతుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉంటారు. అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ పనులపై మనసు నిలుపుతారు. భూ లావాదేవీల్లో లబ్ధి చేకూరుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. శివారాధన శుభప్రదం.
రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ముఖ్యమైన పనుల్లో కదలిక ఉండకపోవచ్చు. రాబడి మందగిస్తుంది. సహోద్యోగులతో సఖ్యత ఉంటుంది. సంయమనంతో ఉండండి. అధికారుల అండదండలు లభిస్తాయి. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. పెద్దల సలహాలు పాటించండి. విద్యార్థులకు మంచి సమయం. వారాంతంలో శుభవార్త వింటారు. దత్తాత్రేయస్వామి ఆరాధన మేలుచేస్తుంది.
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. అనుకోని ఖర్చులు ముందుకురావచ్చు. ఉద్యోగులకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. బాధ్యతతో పనులు చేస్తారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. వ్యాపారులకు భాగస్వాములతో సంబంధాలు బలపడతాయి. గతంలో నిలిచిపోయిన పనుల్లో కదలిక వస్తుంది. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. దుర్గాదేవి ఆరాధన మేలుచేస్తుంది.