08-09-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
రాశి ఫలాలు | మేషం: కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు.

మేషం: కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు. మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు. సోమరితనం ఆవహిస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉండవు.
వృషభం: కుటుంబ పరిస్థుతులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగరంగాల్లో సహనం వహించక తప్పదు.
మిథునం: శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూరపు బంధువులను కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.
కర్కాటకం: బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థినమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.
సింహం: మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
కన్య: రుణప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసంవైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి.
తుల: అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలు ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.
వృశ్చికం: నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది ఆనందంగా కాలక్షేపం చేస్తారు.
ధనుస్సు: శుభకార్యప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
మకరం: కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధవహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది. ఆత్మీయుల సహాయసహకారాలకోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది.
కుంభం: వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది.
మీనం: స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.
పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440 350 868
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

