21-09-2021 మంగళవారం.. మీ రాశి ఫలాలు
Rashi Phalalu | ఆకస్మిక ధనలాభయోగముంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణమేర్పడుతోంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు

మేషం : ఆకస్మిక ధనలాభయోగముంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలుంటాయి. అంతటా అనుకూల వాతావరణమేర్పడుతోంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.
వృషభం : ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారు.
మిథునం : ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. ధన నష్టాన్ని అధిగమించుటకు రుణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి.
కర్కాటకం : బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండుట మంచిది. చేసే పనుల్లో ఇబ్బందులుండును. కొత్త పనులను ప్రారంభించుట మంచిదికాదు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుదురు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
సింహం : శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంలో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
కన్య : ఆకస్మిక ధనలాభముంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభించును. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోని వారికి అభివృద్ధి ఉంటుంది.
తుల : వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.
వృశ్చికం : ఆరోగ్యం గూర్చి జాగ్రత్త పడుట మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుతారు.
ధనుస్సు : నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగియుంటారు. శుభవార్తలు వింటారు.
మకరం : పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు.
కుంభం : ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయుటకు వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి. శత్రు బాధలుండవు.
మీనం : ప్రయత్నకార్యాలందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడుతారు.
పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440 350 868
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

