20-10-2022 గురువారం.. మీ రాశి ఫలాలు
Horoscope | ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరుచేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం.
మేషం
ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరుచేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు.
వృషభం
ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.
మిథునం
గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. సత్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు.
కర్కాటకం
కుటుంబంలో చిన్నచిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
సింహం
మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు.
కన్య
కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషిచేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రులను కలుస్తారు.
తుల
కొత్తకార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరిత్యా కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది.
వృశ్చికం
మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి.
ధనుస్సు
అనుకోకుండా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడటం మంచిది. మనస్తాపానికి గురవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదావేసుకోక తప్పదు.
మకరం
బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. మానసిక ఆందోళన అధిమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
కుంభం
కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధలు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.
మీనం
కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడుతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.
పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440 350 868
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

