23-12-2021, గురువారం.. మీ రాశిఫలాలు
Horoscope | ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశముంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి మానసికాందోళన తప్పదు. నూతన

మేషం : ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశముంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి మానసికాందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది.
వృషభం : కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా ఉండుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు.
మిథునం : శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.
కర్కాటకం : నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగియుంటారు. శుభవార్తలు వింటారు.
సింహం : మానసికానందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
కన్య : ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణ బాధలు తొలగిపోతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు.
తుల : అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసికాందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.
వృశ్చికం : విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధన నష్టమేర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గూర్చి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
ధనుస్సు : కళాకారులకు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు.
మకరం : ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనవసరంగా డబ్బు ఖర్చు అగుటచే ఆందోళన చెందుదురు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించక తప్పదు.
కుంభం : వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడుట మంచిది.
మీనం : స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.
– పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440 350 868
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

