23-04-2021 శుక్రవారం.. మీ రాశిఫలాలు
రాశిఫలాలు| మేషం: ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు.

మేషం: ప్రయత్నకార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్తారు.
వృషభం: మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధవహించక తప్పదు. ప్రయత్నకార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడుపనులకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త అవసరం.
మిథునం: ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.
కర్కాటకం: వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. ఏ విషయంలోనూ నిరుత్సాహం పనికిరాదు.
సింహం: ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినకూడదు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదావేసుకోవడం మంచిది.
కన్య: ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది.
తుల: కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మికధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు. స్త్రీలు, బంధు మిత్రులను కలుస్తారు.
వృశ్చికం: నూతన వస్తు, వస్త్ర ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగిఉంటారు. శుభవార్తలు వింటారు.
ధనుస్సు: మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగి ఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి.
మకరం: ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనకాడరు. రుణబాధలు తొలగిపోతారు. శత్రుబాధలు ఉండవు.
కుంభం: అపకీర్తి రాకుండా జాగ్రత్తపడటం మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
మీనం: కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. రుణబాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.
పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440 350 868
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

