29-03-2022 మంగళవారం.. మీ రాశి ఫలాలు
మేషం : ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు.
వృషభం : తలచిన కార్యాలన్నియు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలుండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులేర్పడుతాయి.
మిథునం : ఇంత వరకు అనుభవించిన కష్టాలన్నీ క్రమేణా తొలగిపోతాయి. నూతన కార్యాలకు శ్రీకారం చుడుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆకస్మిక ధనలాభముంటుంది. గొప్ప వ్యక్తిని కలుస్తారు.
కర్కాటకం : ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశముంది. స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త అవసరం. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోని వారికి మానసికాందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది.
సింహం : రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించు పనులు చేపడుతారు. గౌరవ మర్యాదలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు.
కన్య : నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్త పడుట మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురుకావడంతో ఇబ్బంది పడుతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశముంటుంది.
తుల : నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగియుంటారు. శుభవార్తలు వింటారు.
వృశ్చికం : ప్రయత్నం మేరకు స్వల్ప లాభముంటుంది. వృథా ప్రయాణాలెక్కువ చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడుతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
ధనుస్సు : వ్యవసాయ రంగంలోని వారికి లాభాదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండుట మంచిది. ఆకస్మిక భయము, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది.
మకరం : బంధు, మిత్ర విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. మానసికాందోళ అధికమగును. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
కుంభం : సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలందుకుందురు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడుతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందెదరు.
మీనం : శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంలో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతులవుతారు. కీర్తి, ప్రతిష్ఠలు అధికమవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

