28-03-2022 సోమవారం.. మీ రాశి ఫలాలు
మేషం : అన్ని కార్యములందు విజయాన్ని సాధిస్తారు. అంతటా సౌఖ్యాన్ని పొందుతారు. శత్రు బాధలుండవు. శుభవార్తలు వింటారు. గౌరవ, మర్యాదలు అధికమవుతాయి. అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు. కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభముంటుంది.
వృషభం : అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకై వేచిఉంటారు. దైవదర్శనం లభిస్తుంది.
మిథునం : ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసికాందోళన చెందుతారు. ప్రతి పని ఆలస్యంగా పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండుట మంచిది. విమర్శలను ఎదుర్కొవాల్సి వస్తుంది.
కర్కాటకం : నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ, లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది.
సింహం : ఆకస్మిక ధనలాభముంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయుటకు వెనుకాడరు. రుణ బాధలు తొలగిపోతాయి. శత్రు బాధలుండవు.
కన్య : ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధమేర్పడే అవకాశాలుంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.
తుల : బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండుట మంచిది. చేసే పనుల్లో ఇబ్బందులు ఉండును. కొత్త పనులను ప్రారంభించుట మంచిది కాదు. గృహంలో జరిగే మార్పులవల్ల ఆందోళన చెందుదురు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
వృశ్చికం : తోటివారితో విరోధ మేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ విషయాలందు అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం.
ధనుస్సు : కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించుటకు రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
మకరం : ధర్మకార్యాలు చేయుట యందు ఆసక్తి పెరుగుతోంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యముంటుంది. మానసికానందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభముంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
కుంభం : కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండుటచే మానసికానందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.
మీనం : మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండుటకు ప్రయత్నించాలి.
పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440 350 868
Read Today's Latest Horoscope News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

