World Lung Cancer Day | పెరుగుతున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు..! ఈ తప్పులు మీరూ చేస్తున్నారా..?
World Lung Cancer Day | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్యానర్స్ పెరుగుతున్నది. క్యాన్సర్లలో తీవ్రమైంది ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒకటి. దీంతో ఏటా లక్షణాలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లంగ్ క్యాన్సర్ ఎక్కువగా పెద్దవారిలో కనిపిస్తూ ఉంటుంది.
World Lung Cancer Day | ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్యానర్స్ పెరుగుతున్నది. క్యాన్సర్లలో తీవ్రమైంది ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒకటి. దీంతో ఏటా లక్షణాలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లంగ్ క్యాన్సర్ ఎక్కువగా పెద్దవారిలో కనిపిస్తూ ఉంటుంది. ఊపిరితిత్తులు ఛాతీకి ఇరువైపులా ఉండే ఒక జత మెత్తటి, గాలితో నిండిన అవయవాలు. ఇవి ఆక్సిజన్‌ను తీసుకొని కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపుతుంటాయి. లంగ్స్ హృదయనాళ వ్యవస్థతో కలిసి పని చేస్తాయి. అయితే, మారుతూ వస్తున్న జీవనశైలిలో అలవాట్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులు భారీగా పెరుగుతున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా ఆగస్టు 1న ప్రపంచ లంగ్ క్యాన్సర్ డే నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే, పలు చిట్కాలు పాటించి ఊపిరితిత్తుల క్యాన్సర్ నుంచి బయటపడవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు
తరచుగా దగ్గు.. న్యుమోనియా సమస్య చికిత్స తీసుకున్న తర్వాత కూడా తిరగబెడుతుందంటే ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు సంకేతమని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత సాధారణ లక్షణాల్లో నిరంతర, తీవ్రమైన దగ్గు ఉండడం, శ్వాస ఆడకపోవడం, ఛాతీలో నొప్పి, గొంతు బొంగురుపోవడం, బరువును కోల్పోవడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. జీవనశైలిలో చోటు చేసుకుంటున్న మార్పులు, మారుతూ వస్తున్న ఆహారపు అలవాట్లు క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయని, ఈ క్రమంలో ప్రజలంతా జాగ్రత్తగా వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ధూమపానం వల్ల చాలా ప్రమాదం
ఊపిరితిత్తుల క్యాన్సర్.. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)కి ధూమపానం ప్రధాన కారణం. సిగరెట్ల పొగ శ్వాసనాళాలను కుచించుకుపోయేలా చేస్తుంది. దాంతో శ్వాస తీసుకోవడం కష్టతరంగా ఉంటుంది. ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక మంటను కలిగిస్తుంది. కాల క్రమేణా సిగరెట్ పొగ ఊపిరితిత్తుల కణజాలాన్ని సైతం దెబ్బతీస్తుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే, ధూమపానం చేసే వారికి మాత్రమే కాకుండా ఆ పొగను పీల్చే వారికి సైతం ప్రమాదమే. ధూమపానం చేసేవారితో సమానంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉంటుంది. స్వరపేటిక, నాసికా సైనసెస్, రొమ్ము క్యాన్సర్, శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేసే అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.
గాలి కాలుష్యం సైతం..
గాలి నాణ్యత సైతం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణాల్లో ఒకటి అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. చాలా మంది రోజులో ఎక్కువ సమయం ఇళ్లు, ఆఫీసుల్లోనే గడుపుతున్నారు. అయితే, గాలి నాణ్యత సరిగా లేకుంటే ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నది. ఇంటి లోపల గాలి.. బయటి గాలి కంటే కలుషితమవుతుంది. ఈ క్రమంలో గదుల్లోకి స్వచ్ఛమైన గాలిని వచ్చేలా చూసుకోవాలి. కలుషిత నీటిలో ఆర్సెనిక్ ఎక్కువగా ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు గుర్తించారు. ఈ కలుషిత నీటిని తాగిన సమయంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉంటుంది. చాలా అధ్యయనాల్లో నీటిలో ఆర్సెనిక్ స్థాయిలు యునైటెడ్ స్టేట్స్లో కనిపించే దానికంటే ఎక్కువగా ఉన్నాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని నివారించడానికి శుద్ధ జలాలను తీసుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

